అయ్యప్ప స్వామి దీక్షలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

అయ్యప్ప స్వామి దీక్షలు ప్రారంభం

Nov 12 2026 1:25 AM | Updated on Nov 12 2026 1:25 AM

మాలధారణ చేస్తున్న అయ్యప్ప స్వామి ఆలయ పూజరి బాలస్వామి,దీక్ష స్వీకరించడానికి హాజరైన భక్తులు

కర్నూలు కల్చరల్‌: కార్తీక మాసం ప్రారంభం కావడంతో అయ్యప్ప స్వామి భక్తులకు అత్యంత ప్రీతి పాత్రమైన బుధవారం రోజు భక్తులు అయ్యప్ప దీక్షలు ీస్వీకరించారు. నగరంలోని భాస్కర్‌నగర్‌ అయ్యప్పస్వామి ఆలయం, సప్తగిరినగర్‌లోని మణికంఠ అయ్యప్పస్వామి ఆలయాల్లో వందల సంఖ్యలో అయ్యప్ప భక్తులు దీక్ష స్వీకరించారు. భక్తుల అయ్యప్ప స్వామి శరణు ఘోషతో ఆలయాలు మారుమోగాయి. అంతకు ముందు అయ్యప్ప స్వామికి పంచామృతాఽభిషేకం, ప్రత్యేక అలంకరణతో భక్తులకు దర్శనం కల్పించారు. సుమారు 800 మంది భక్తులు అయ్యప్ప దీక్ష స్వీకరించినట్లు ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement