పూజ సామగ్రి కాలువలో పారవేస్తూ.. | - | Sakshi
Sakshi News home page

పూజ సామగ్రి కాలువలో పారవేస్తూ..

Nov 12 2026 1:25 AM | Updated on Nov 12 2026 1:25 AM

● కాలువలో పడి వ్యక్తి దుర్మరణం

పత్తికొండ: పూజలో వినియోగించిన పూలతో పాటు ఇతరత్రా వస్తువులను కాలువలో పారవేయడానికి వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు కాలు జారి మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన పత్తికొండ పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది. పట్టణంలోని సుంకంగేట్‌ దగ్గర అవకాలమ్మ గుడి సమీపంలో నివాసం ఉండే సురేష్‌శెట్టి(42) ఇంట్లో దీపావళి పండుగతో పాటు కార్తీకమాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. రెండు రోజులు పాటు పూజా కార్యక్రమాల కోసం వినియోగించిన వస్తువులను నీళ్లలో వసేందుకు ఉదయాన్నే సమీపంలోని హంద్రీనీవా కాల్వ వద్దకు చేరుకున్నాడు. మెట్ల దగ్గర కాలువలోకి దిగుతున్న సమయంలో హఠాత్తుగా కాలు జారీ హంద్రీనీవా కాలువలో పడిపోయి గల్లంతయ్యాడు. కాలువ మీద వాకింగ్‌ చేస్తున్న కొందరు గుర్తించి ఆయనను కాపాడటానికి ప్రయత్నం చేశారు. వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులుకు సమాచారం ఇచ్చారు. సిబ్బంది అక్కడికి చేరుకుని గాలిస్తుండగా సంఘటనకు కొద్ది దూరంలోనే మృతదేహాన్ని గుర్తించి బయటకు తీశారు. మృతుడుకి భార్య రాధిక, కుమారుడు, కుమార్తె ఉన్నారు. వారు సమాచారం అందుకున్ని అక్కడికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకోని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పత్తికొండ ప్రభుత్వ అసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement