కర్నూలు: నగరంలోని జొహరాపురం రోడ్డులోని అశ్విని ఆసుపత్రి వెనుక ఉన్న ఏబీసీ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ అండ్ బాబా హియరింగ్ ఎయిడ్ సెంటర్ నుంచి యశ్వంత్ రెడ్డి (8) అదృశ్యమయ్యాడు. ఈ మేరకు మూడో పట్టణ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. బాలుడు పుట్టుకతోనే మూగ, చెవిటితో బాధ పడుతుండేవాడు. కొంతకాలంగా ఆటిజమ్ థెరపీ సెంటర్ ఇన్స్టిట్యూట్లో స్పీచ్ థెరపీ ట్రైనింగ్ పొందుతున్నాడు. మంగళవారం సాయంత్రం ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు వెళ్లాడు. బాలుడి కోసం కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికినా కనిపించలేదు. బయటకు వెళ్లేటప్పుడు ఎల్లో ఫుల్ టీషర్టు, బ్లాక్ కలర్ ప్యాంటు ధరించాడు. స్కూల్ బ్యాగ్ కూడా వెంట తీసుకెళ్లాడు. ఆచూకీ తెలిసినవారు సెల్ 9121101061, 9347331804 నంబర్లలో.. లేదా 08518–277187కు ఫోన్ చేసి సమాచారమివ్వాలని సీఐ శేషయ్య విజ్ఞప్తి చేశారు.


