నెదర్లాండ్ నివాసి జూలియా
బేతంచెర్ల: పట్టణంలో అక్రమంగా తరలిస్తున్న 110 ప్యాకెట్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం రాత్రి పట్టణంలోని బొరుగుల బట్టి నిర్వాహకుడు వెంకట నారాయణ రెడ్డి వద్ద నుంచి ఐచర్ వాహనంలో తరలిస్తున్న బియ్యాన్ని అయ్యప్ప స్వామి ఆలయం వద్ద అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌ఐ రమేష్ బాబు తెలిపారు. వాహన డ్రైవర్ నేష కార్తీక్‌తో పాటు బొరుగుల బట్టి నిర్వాహకుడు వెంకట నారాయణ రెడ్డిపై కేసు నమోదు చేసి, వాహనాన్ని సీజ్ చేసినట్లు ఎస్‌ఐ వెల్లడించారు.
శ్రీశైల సందర్శనతో ఆధ్యాత్మిక శక్తి
శ్రీశైలంటెంపుల్:‘జ్యోలిర్లింగ క్షేత్రాల యాత్ర లో భాగంగా భారతదేశంలో పర్యటిస్తున్నా ను. ఇప్పటి వరకు ఐదు జ్యోతిర్లింగాలు సందర్శించాను. శ్రీశైల యాత్రతో ఆరు జ్యోతిర్లింగాల సందర్శన పూర్తి అయింది. శ్రీశైలం యాత్ర ఎంతో సంతృప్తిని ఇవ్వడంతో పాటు పరిపూర్ణమైన ఆధ్యాత్మిక శక్తిని ఇచ్చింది. ఇ క్కడి వాతావరణం చాలా బాగుంది. ఒకే ప్రా ంగణంలో జ్యోతిర్లింగం, శక్తిపీఠం కలగలసి ఉండడం ఎక్కడా చూడలేదు’ అని నెదర్లాండ్ నివాసి జూలి యా అన్నారు. భారతదేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం చేసుకోవాలన్న సంకల్పంతో ఐదేళ్ల నుంచి వస్తూ ఇప్పటి వరకు ఐదు క్షేత్రాలను దర్శించుకున్న ఆమె మూడు రోజుల క్రితం మల్లికార్జున స్వామివారి దర్శనానికి శ్రీశైలం చేరుకున్నారు. సోలోగా వచ్చిన ఈ పిలిగ్రీమ్ ట్రావెలర్‌కు వసతి గది ఇవ్వకపోవడంతో శ్రీశైల వాసి నటరాజస్వామి విజ్ఞప్తి మేరకు శ్రీశైలంలోని అక్కమహాదేవి చైతన్య కేంద్రం వద్ద వసతి కల్పించారు. ఆన్‌లైన్‌లో టికెట్లు పొంది స్పర్శదర్శనం, రుద్రహోమం, భ్రమరాంబాదేవికి చండీహోమం, కుంకుమార్చన, మహా మృత్యుంజయ హోమం, గణపతి హోమం, స్వామిఅమ్మవార్లకు లీలా కల్యాణం, వృద్ద మల్లికార్జున స్వా మివారికి అభిషేకం, వేదాశీర్వచనం చేసుకున్నారు. దేవస్థానం ప్రచురించిన శ్రీశైలఖండం పుస్తకాన్ని రూ.1200 చెల్లించి కొనుగోలు చేశారు. ఆమెకు ఈఓ శ్రీనివాసరావు క్షేత్ర ప్రాశస్త్యం, క్షేత్ర విశేషాలు, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, భయ దేవాలయాల్లో నిర్వహించే ఉత్సవాలు, క్షేత్ర మహిమా విశేషాలను వివరించారు.


