బనగానపల్లె: పట్టణంలోని మంగళవారం పేటలో ఓ మహిళ ఆత్మ హత్యకు పాల్పడినట్లు సీఐ ప్ర వీణ్ కుమార్ తెలిపా రు. కోడుమూరుకు చెందిన లత (26)కు ఏడేళ్ల క్రితం బనగానపల్లెకు చెందిన చంద్రశేఖర్‌తో వివాహమైంది. వీరికి రెండేళ్ల కూతురు ఉంది. అయితే ఏమి జరిగిందో తెలియదు కానీ.. బుధవారం మధ్యాహ్నం ఇంటిలో ఎవరూ లేని సమ యంలో ఆమె ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి వుందని సీఐ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
భార్యను కాపురానికి పంపలేదని ..
బేతంచెర్ల: పట్టణంలోని హెచ్‌పీ గ్యాస్ గోడౌన్ వద్ద నివాసం ఉంటున్న వుశేన్ బాషా అనే వ్యక్తి భార్యను కాపురానికి పంపడం లేదని బామర్ది బైక్‌కు నిప్పు పెట్టాడు. బాధితుడు మౌలాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్ కానిస్టేబుల్ చెన్నయ్య తెలిపారు. వివరాల మేర కు పట్టణంలోని పాతపోస్టాఫీసు వీధిలో ఉన్న నసిమూన్, వుశేన్ బాషాకు వివాహమైంది. భర్త మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో నసిమూన్ పుట్టింటిలో ఉంది. కాపురానికి రావాలని వుశేన్ బాషా ఈనెల 9వ తేదీన రాత్రి నసిమూన్ పుట్టింటి వద్దకు వెళ్లి గొడవ పడ్డారు. ఆమె కాపురానికి రానని తేల్చిచెప్పింది. దీంతో అర్ధరాత్రి బామర్ధి మౌలాలి బైక్‌కు వుశేన్ బాష నిప్పు పెట్టడంతో దగ్ధమైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు హెడ్ కానిస్టేబుల్ తెలిపారు.
ఉరేసుకుని యువకుడు మృతి
ఓర్వకల్లు: కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన ఓ యు వకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బుధవారం మండలంలోని నన్నూ రు గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మీదివేముల గ్రామానికి చెందిన గొల్ల నిద్రము మల్లయ్య కుమారుడు సురేష్ కుమార్ (35) బీటెక్ పూర్తి చేసి కొద్ది రోజుల పాటు హైదరాబాద్‌లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. సుమారు ఆరేళ్ల క్రితం నన్నూరు గ్రామానికి చెందిన గొల్ల శ్రీనివాసులు కూతురు శిరీషతో వివాహమైంది. వీరికి ఒక కుమారుడు ఉన్నారు. పెళ్లయిన ఏడా ది కాలం వీరి కాపురం సజావుగా సాగింది. త ర్వాత కుటుంబ కలహాలతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. భార్యను కాపురానికి రమ్మని పిలిచిన తన కుమారునిపై వారి కుటుంబ సభ్యులు దాడి చేయడంతో మనస్తాపం చెంది ఇంట్లో ఉరేసుకుని మృతి చెందినట్లు మృతుని తండ్రి మల్లయ్య ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
ట్రావెల్స్ బస్సులు ఢీ
కర్నూలు: కర్నూలు శివారులో జాతీయ రహదారిపై రెండు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు ఢీకొన్నాయి. బాలగంగాధర్ ట్రావెల్స్ బస్సు హైదరాబాదు నుంచి తిరుపతికి వెళ్తూ బుధవారం ఉద యం 6 గంటల సమయంలో తుంగభద్ర బ్రిడ్జి సమీపంలో ఆగి ఉంది. అదే సమయంలో వెనుక నుంచి హైదరాబాదు నుంచి కడపకు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి ఢీకొట్టింది. బస్సులో ప్రయాణిస్తున్న యాత్రికులు స్వా ములు (47), ప్రభాకర్‌రెడ్డి (23) గాయాలపాల య్యారు. హైవే పెట్రోలింగ్ పోలీస్‌లు ఘట నా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గురైన వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారికి చిన్న చిన్న గాయాలు కావడంతో వైద్యులు ప్రథమ చికిత్స చేసి పంపించేశారు. విషయం తెలుసుకున్న కర్నూలు అర్బన్ తాలూకా పోలీసు లు సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.


