లోకేశ్‌ గారు.. 90 రోజులైంది హైకోర్టు బెంచ్‌ ఎక్కడ? | - | Sakshi
Sakshi News home page

లోకేశ్‌ గారు.. 90 రోజులైంది హైకోర్టు బెంచ్‌ ఎక్కడ?

Nov 12 2026 1:25 AM | Updated on Nov 12 2026 1:25 AM

● జూనియర్‌ అడ్వకేట్లకు ఇస్తామన్న రూ.10 వేలు స్టైఫండ్‌ ఇంకెప్పుడిస్తారు? ● హామీలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం ● వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ జిల్లా అధ్యక్షులు జి. స్వాములు

● జూనియర్‌ అడ్వకేట్లకు ఇస్తామన్న రూ.10 వేలు స్టైఫండ్‌ ఇంకెప్పుడిస్తారు? ● హామీలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం ● వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ జిల్లా అధ్యక్షులు జి. స్వాములు

కర్నూలు (టౌన్‌): ఈ ఏడాది జూలై 30వ తేదీన ఆదోనికి వచ్చిన ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ .. 90 రోజుల్లో కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేస్తామని చెప్పిన గడువు పూర్తయిందని, బెంచ్‌ ఏమైందని.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లీగల్‌ సెల్‌ జిల్లా అద్యక్షులు జి. స్వాములు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బుధవారం స్థానిక జిల్లా కోర్టులోని జిల్లా న్యాయవాదుల సంఘం కార్యాలయ ప్రాంగణంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో న్యాయవాదుల కు, జూనియర్‌ అడ్వకేట్లకు ఎన్నో హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. ప్రభుత్వం వచ్చి మూడేళ్లు అవుతున్న ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. రాజ్యాంగ బద్ధ పాలనను పక్కనపెట్టి రాష్ట్రంలో ‘రెడ్‌ బుక్‌ రాజ్యాంగం’అమలు చేస్తూ ప్రతిపక్షాల గొంతు నొక్కడం, న్యాయవాదులను వేధించడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు. కర్నూలులో ఉన్న హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌, లోకాయుక్త, ఇతర ట్రిబ్యునళ్లను విజయవాడకు తరలించేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుందని, ఈ ప్రభుత్వానికి ఒకప్పటి రాజధాని అయిన కర్నూలు అంటే ఎందుకంత వివక్ష అన్నారు. జూనియర్‌ అడ్వకేట్లకు నెలకు రూ. 10 వేలు స్టైఫండ్‌ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. న్యాయవాద వృత్తిని నమ్ముకున్న యువ న్యాయవాదులను ప్రోత్సహించడంలోనూ, రాయలసీమ ప్రాంత ఆకాంక్షలను నెరవేర్చడంలోనూ ఈ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందన్నారు. నారా లోకేశ్‌ ఇచ్చిన హామీ మేరకు వెంటనే కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. లోకాయుక్త, ఇతర ట్రిబ్యునళ్లను విజయవాడకు తరలించే ప్రయత్నాలను తక్షణం విరమించుకుని కర్నూలులోనే కొనసాగించి మౌలిక వసతులు కల్పించాలన్నారు. హామీలు విస్మరించి, రెడ్‌ బుక్‌ రాజ్యాంగంతో కక్షసాధింపులకు దిగుతున్న టీడీపీ ప్రభుత్వానికి 2029 ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి పి. సువర్ణ రెడ్డి, న్యాయవాదులు రాజేష్‌, మహేష్‌ బాబు, ప్రభాకర్‌, ఇతర న్యాయవాదులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement