కడమకుంట్ల నుంచి లంకాయపల్లె గ్రామానికి వెళ్లేందుకు రోడ్డు సరిగ్గా లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాం. వర్షాకాలంలో వానలు కురిఏ్త ఆటోలు కూడా వెళ్లలేవు. మోటారు సైకిల్‌పై వెళ్లే వారు కూడా పలు సందర్భాల్లో ప్రమాదాలకు గురయ్యారు. ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో వారి ఇబ్బందులు వర్ణనాతీతం. ఇప్పటికై నా లంకాయపల్లె రోడ్డును బాగు చేయాల్సి ఉంది.
– హనుమంతరెడ్డి, కడమకుంట్ల, తుగ్గలి మండలం
సజ్జలగుడ్డం నుంచి దేవరబెట్టకు వెళ్లేందుకు నిత్యం ఇబ్బందులు పడుతున్నాం. రోడ్డు సరిగ్గా లేకపోవడంతో అవస్థలు ఎదుర్కొంటున్నాం. రోడ్డు మధ్యలో కల్వర్ట ఉంది. వర్షాలు వస్తే నీళ్లు రోడ్డు పైకి వస్తాయి. నీళ్లు తగ్గేంతవరకు రాకపోకలు ఉండవు. ఈ రోడ్డు తప్ప మాకు వేరే మార్గం లేదు.
– శ్రీనివాసులు, దేవరబెట్ట, కోసిగి మండలం
● కోసిగి మండలంలోని కడదొడ్డి గ్రామ ప్రజలు కూడా రోడ్లు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. వీరు తమ గ్రామం నుంచి మండల కేంద్రమైన కోసిగికి చేరుకోవాలంటే, కోసిగి – తుంగభద్ర వెళ్లే బస్సులో ప్రయాణించి కందుకూరు స్టేజీ వద్ద దిగి కడదొడ్డికి రెండు కిలోమీటర్లు నడచిపోవాల్సి ఉంది. గ్రామానికి వెళ్లే రోడ్డు కూడా పూర్తి స్థాయిలో శిథిలావస్థకు చేరడంతో ప్రజలు నిత్యం ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. సజ్జలగుడ్డం నుంచి దేవరబెట్టకు వెళ్లే ప్రజలు కూడా సరైన రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు.
కర్నూలు(అర్బన్): జిల్లాలో పూర్తిగా శిథిలమైన రోడ్లను బాగు చేసేందుకు హార్టికల్చర్ ప్రాజెక్టు కింద పంపిన ప్రతిపాదనలు నేటికి కార్యరూపం దాల్చలేదు. తద్వారా గ్రామీణ ప్రజలు నిత్యం శిథిలమైన రోడ్లపై ప్రయాణాలు చేస్తు ఇబ్బందులకు గురవుతున్నారు. మూడు విడతలుగా మొత్తం 788.25 కిలోమీటర్ల మేర 232 రోడ్ల పనులను చేపట్టేందుకు పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు రూ.570 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. అయితే ఈ ప్రతిపాదనలపై ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లభించలేదు.
అటకెక్కిన ప్రతిపాదనలు ...
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, జిల్లాలోని 721 గ్రామాల్లో నివశిస్తున్న 15,44,771 మంది ప్రజలకు రోజుకు 55 లీటర్ల మంచినీటిని అందించేందుకు రూ.2,432.31 కోట్లతో వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు ప్రతిపాదనలను ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పంపారు. అయితే నేటికి ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. ఈ ప్రాజెక్టు అమలుకు నోచుకుంటే ... కోడుమూరు, పాణ్యం, పత్తికొండ, ఆదోని, ఆలూరు, మంత్రాలయం నియోజకవర్గాలకు చెందిన గ్రామాలకు ప్రయోజనం ఉంటుంది. ప్రతి ఏటా జిల్లాలోని పశ్చిమ ప్రాంత ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని జిల్లాకు పలుమార్లు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి కూడా తీసుకువెళ్లారు. అయినా, నేటికి పలు మంచినీటి పథకాలు కార్యరూపం దాల్చకపోవడంతో జిల్లాలోని మెజారిటీ గ్రామాలు తీవ్ర తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నాయి.
రుణాలు ఇవ్వకుండా..
స్వయం ఉపాధి పథకాలు ఏర్పాటు చేసుకొని ఆర్థికంగా తమ జీవన విధానాన్ని మార్చుకోవాలని ఆశపడిన పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు కూటమి ప్రభుత్వం మోసం చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా రుణాలు అందిస్తామని చెప్పి మోసం చేయడం పట్ల ప్రజలు తమ అక్కసును వెలిబుచ్చుతున్నారు.
● ఏడాది క్రితం జిల్లాలోని బీసీ వర్గాలకు బీసీ కార్పొరేషన్ ద్వారా రూ.41.23 కోట్ల రుణాలు ఇస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. దీంతో 2,034 మంది బీసీ కులాలకు చెందిన ప్రజలు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ప్రక్రియపై నేటికి ఒక్కరికి కూడా రుణాలు అందిన దాఖలాలు లేవు.
● ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 973 మంది దళిత వర్గాలకు చెందిన పేద ప్రజలకు రూ.4073 మందికి రుణాలు ఇస్తున్నట్లు ప్రకటించారు. అర్హులైన ఎస్సీలకు రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు వరుకు ( 40 నుంచి 60 శాతం సబ్సిడీ ) రుణాలు ఇస్తున్నట్లు నమ్మించారు. అయితే, నేటికి జిల్లాలోని ఎస్సీ వర్గాలకు ఎలాంటి రుణాలు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందలేదు.
ప్రచారంలో దూసుకుపోతున్న వైఎస్సార్సీపీ అభ్యర్థులు...
ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలే అజెండాగా జిల్లాలోని అన్ని జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో మెజారిటీ హామీలను నెరవేర్చలేదు. నెరవేర్చినట్లు చెబుతున్న హామీల్లో ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రజలు వైఎస్సార్సీపీ అభ్యర్థుల దృష్టికి తీసుకువస్తున్నారు. పల్లెల్లో కనీసం రోడ్లు, డ్రెయినేజీలు, తాగునీరు వంటి సమస్యలను కూడా పరిష్కరించడం లేదని రెండున్నరేళ్ల కూటమి పాలనలో తమకు ఒరిగింది ఏమి లేదని, ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని ప్రజలు తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో కూడా వైఎస్సార్సీపీ నేతలు సమన్వయం, ఐకమత్యంతో ముందుకు పోతున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల గ్రాఫ్ రోజురోజుకు పెరుగుతోంది. ప్రజల నుంచి తమకు లభిస్తున్న స్పందనతో రెట్టింపు ఉత్సాహంతో అభ్యర్థులు ప్రచారాలను హోరెత్తిస్తున్నారు.
.. ఇలా జిల్లాలోని అనేక గ్రామాల ప్రజలకు నేటికీ మట్టిరోడ్లే దిక్కుగా మారాయి. ఈ రోడ్లు కూడా బాగున్నాయనుకుంటే పొరపాటే, ఈ మట్టి రోడ్లలో మెజారిటీ రోడ్లు పూర్తి శిథిలావస్థకు చేరాయి. కనీసం ఈ రోడ్లపై తట్టెడు మట్టి కూడా వేయలేని దుస్థితి. అధికారంలోకి రాక ముందు రోడ్లపై వివిధ రూపాల్లో యాగీ చేసిన కూటమి నేతలు ప్రస్తుతం నోరు మెదపడం లేదు. ప్రతి మండలంలో కనీసం నాలుగైదు గ్రామాలకు చెందిన రోడ్లు పూర్తి అధ్వాన్నంగా మారాయి.
పల్లె ప్రజలను పీడిస్తున్న
అనేక సమస్యలు
కార్యరూపం దాల్చని హార్టికల్చర్
ప్రాజెక్టు ప్రతిపాదనలు
అటకెక్కిన రూ.2,428.31 కోట్ల
వాటర్ గ్రిడ్ ప్రతిపాదనలు
రుణాలు ఇస్తామని ఊరించిన
చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల అక్కసు
ప్రభుత్వ వ్యతిరేకతే అజెండాగా
ప్రచారాల్లో దూసుకుపోతున్న వైస్సార్సీపీ


