మరోసారి ప్రజలు మోసపోవద్దు | - | Sakshi
Sakshi News home page

మరోసారి ప్రజలు మోసపోవద్దు

Nov 4 2026 1:56 AM | Updated on Nov 4 2026 1:56 AM

● గోరుకల్లు ఘటన నిందితులను

ఎందుకు పట్టుకోలేదు

● వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు

కాటసాని రాంభూపాల్‌రెడ్డి

పాణ్యం: స్థానిక ఎన్నికల వేళ టీడీపీ నాయకుల మాయమాటలు నమ్మి మరోసారి మోసపోవద్దని వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన గోరుకల్లు, కొండజూటూరు, కౌలూ రు, మద్దూరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేశారు. ముందుగా గోరుకల్లులో ఆయన ఇంటింటికీ వెళ్లి ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి షేక్‌ మలాన్‌బీ, జెడ్పీటీసీ అభ్యర్థి గని సత్యాలను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. స్థానిక రామాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చేపలు పట్టుకునేందుకు గోరుకల్లు గేట్లు ఎత్తి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన వ్యక్తులను ప్రజాప్రతినిధులుగా పోటీ చేసే అవకాశం కల్పించిన దౌర్భాగ్యమైన దుస్థితి టీడీపీకి పట్టిందన్నారు. ఘటన జరిగి రెండు నెలలు గడిచినా నిందితులను ఇప్పటి వరకు ఎందుకు పట్టుకోలేకపోయని విమర్శించారు. ప్రస్తుతం టీడీపీ తరఫున పాణ్యంలో పోటీ చేస్తున్న అభ్యర్థుల వ్యాపారం రేషన్‌ బియ్యం దందా అని, సాక్షాత్తు నంద్యాల ఎంపీ ఆధ్వర్యంలో దాడులు జరిగితే వారు వైఎస్సార్‌సీపీకి చెందిన వారంటూ ప్రచారం చేశార న్నారు. తీరా ఇప్పుడు ఆ కుటుంబాల వ్యక్తులకు టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థులుగా టికెట్లు ఇవ్వడం వాస్తవం కాదా అన్నా రు. ఇలాంటి వ్యక్తులు పోటీ చేస్తున్నారని, ఓటర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. గత వైఎస్సార్‌సీపీ పాలనలో వేసిన రోడ్లు తప్పా కొత్తవి ఎక్కడ వేశారని ప్రశ్నించారు. పాణ్యం – గోరుకల్లు రోడ్లుకు ఆనాడే బీటీ రోడ్డు వేసి ప్రజల రాకపోకలు ఇబ్బందులు లేకుండా చేశామన్నారు. కాని ఇప్పుడు రోడ్డు వేసినట్లు ప్రచారం చేసుకుంటూ నవ్వులపాలవుతున్నారన్నారు. కాటసాని వెంట మాజీ జెట్పీటీసీ సభ్యులు సద్దల సూర్యనారాయణరెడ్డి, జింకల సుబ్బారెడ్డి, మాజీ సర్పంచ్‌ సద్దల సుజిత్‌రెడ్డి, రామలక్ష్మయ్య, అమర్నాథ్‌రెడ్డి, వెంకటరామిరెడ్డి, లక్ష్మీమద్దయ్య, గోపాల్‌, డాల్‌సా, బాబు, వడ్డుగండ్ల రాముడు, జయచంద్రారెడ్డి తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement