కడప చిల్డ్రన్‌ హోంకు ఇద్దరు బాలురు | - | Sakshi
Sakshi News home page

కడప చిల్డ్రన్‌ హోంకు ఇద్దరు బాలురు

Nov 4 2026 1:56 AM | Updated on Nov 4 2026 1:56 AM

ఆసుపత్రిలో నీటి వృథాను అరికట్టాలి

కర్నూలు(అర్బన్‌): నగరంలోని రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌ ప్రా ంతాల్లో గుర్తి ంచిన ఇద్దరు బాలురను సీడబ్ల్యూసీ ఆదేశాల మేరకు కడపలోని ప్రభుత్వ చిల్డ్రన్‌ హోం సంరక్షణలో ఉంచడం జరిగిందని జిల్లా మహిళ శిశు సంక్షేమ సాధికారత అధికారి కే నరసమ్మ తెలిపా రు. రైల్వేస్టేషన్‌ ప్రాంతంలో షేక్‌ తన్వీర్‌ ( 11 ), బస్టాండ్‌ ప్రాంతంలో చిన్న ( 10 )ను గుర్తించడం జరిగిందని ఆమె మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ బాలురను క్లెయిమ్‌ చేసుకునేందుకు వీరికి జన్మనిచ్చిన తల్లిదండ్రులు గాని సంబంధీకులు ఈ ప్రకటన వెలువడిన 30 రోజుల్లోగా తగిన సాక్షాధారాలతో తమను సంప్రదించాలన్నారు. లేని పక్షంలో ఈ బాలురను వదలివేయబడిన వారిగా ప్రకటించి ప్రభుత్వ నిబంధనల మేరకు దత్తత ఇవ్వడం జరుగుతుందని ఆమె తెలిపారు.

ప్రకృతి వ్యవసాయాన్ని

తెలుసుకోవడం ముఖ్యం

● కెనెడా వర్సిటీ ప్రొఫెసర్‌ జయితా శర్మ

వెల్దుర్తి: ప్రకృతి వ్యవసాయం ఎంతో మేలు చేస్తుందని, ప్రపంచంలోని అన్ని దేశాలు తెలుసుకోవడం ముఖ్యమని కెనెడాలోని యూనివర్సిటీ ఆఫ్‌ టోరెంటో ప్రొఫెసర్‌, పీడింగ్‌ సిటీ ల్యాబ్‌ డైరెక్టర్‌ జయితా శర్మ అన్నారు. వెల్దుర్తి మండల పరిధిలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను మంగళవారం ఆమె పరిశీలించారు. మల్లెపల్లె రైతు పవిత్ర చేపట్టిన ప్రకృతి వ్యవసాయ క్షేత్ర వివరాలు తెలుసుకున్నారు. మదార్‌ పురంలో రామకృష్ణారెడ్డి వ్యవసాయ వనరుల కేంద్రాన్ని, గుంటుపల్లెలో రవికుమార్‌ రెడ్డి ఉద్యాన పంటను పరిశీలించారు. పొదుపు మహిళలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయాన్ని, విత్తన గుళికలు, జీవామృతం తదితరాల తయారీని డెమో ద్వారా తెలుసుకున్నారు. ఆమె వెంట పీడీ మాధురి, డీపీఎం శ్వేత, డీఎల్‌పీఎమ్‌ లక్ష్మయ్య, స్టేట్‌ టీం మెంబర్‌ స్వాతి, పీఈ సందీదప్‌ కుమార్‌, ఎన్‌ఎఫ్‌ఏ మల్లికార్జున, డీపీపీ శ్వేత, ఎఫ్‌ఎమ్‌టీలు జనార్దన్‌, జగన్‌, పరమేశ్వరుడు ఉన్నారు.

కోలుకోలేక మహిళ మృతి

రుద్రవరం: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన టీ.లింగందిన్నెకు చెందిన నాగహరిత(30) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శిరివెళ్ల మండలం ఇసుకపల్లెకు చెందిన గురవయ్యతో వివాహం కాగా అయితే నాలుగేళ్ల క్రితం భర్త మృతి చెందాడు. ఆమె కొంత కాలం అక్కడే ఉంటూ ఇటీవల పుట్టింటికి వచ్చింది. అయితే భర్త మరణంతో మనస్తాపానికి గురైన ఆమె జీవితంపై విరక్తి చెంది గత నెల19వ తేదీన గడ్డి మందు తాగి అపస్మారక స్థితిలో పడిపోయింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ కోలుకోలేక మంగళవారం మృతి చెందింది. మృతురాలి తండ్రి వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్‌ కానిస్టేబుల్‌ రవికుమార్‌ తెలిపారు.

కర్నూలు(హాస్పిటల్‌): ఆసుపత్రిలో నీటి వృథాను అరికట్టాలని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సీఎస్‌ఆర్‌ఎంఓ డాక్టర్‌ పి.పద్మజ సూచించారు. మంగళవా రం ఆసుపత్రి ప్రాంగణంలో నీటిసంరక్షణ అవగాహన కార్యక్రమం, ర్యాలీ నిర్వహించారు.ఆమె మాట్లాడు తూ నీటి ప్రాముఖ్యత, నీటి వృథాను అరికట్టాల్సిన ఆవశ్యకత, భవిష్యత్‌ తరాల కోసం నీటిని పొదుపు చేయాల్సిన బాధ్యతపై ప్రజలకు అవగాహన కల్పించా రు. ఆసుపత్రి ప్రాంగణంలోని కుళాయిలు, నీటి పైప్‌లైన్లను పరిశీలించి ఎక్కడైనా నీటి లీకేజీలు, వృథా జరుగుతున్నాయా అనే అంశంపై ఆడిట్‌ నిర్వహించాలని చెప్పారు.

వైద్య ఆరోగ్యశాఖలో..

సుస్థిర జీవనశైలి వారోత్సవాలను పురస్కరించుకు ని మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయ ఆవరణలో అధికారులు మొక్కలు నాటారు. నీటి వృథాను అరికట్టాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని డీపీఎంఓ హేమలత సూచించారు. డెమో ఎన్‌.ప్రకాష్‌రాజు, డిప్యూటీ హెచ్‌ఈఓ షఫీవున్నీసా, డిప్యూటీ హెచ్‌ఈఓ పద్మావతి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement