● కేంద్ర బృందం ఎదుట రైతుల ఆవేదన
జూపాడుబంగ్లా/ఆత్మకూరు: తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో పంటలు గిడసబారి, ఎండిపోయి తీవ్రంగా నష్ట పోయామని, ప్ర భుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్యలు శరణ్యమని.. ఆయా గ్రా మాల రైతులు ఇంటర్ మినిస్ట్రీయల్ సెంట్రల్ టీమ్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో కరువు పరిస్థితులను పరిశీలించేందుకు మంగళవారం కేంద్ర ప్రభుత్వ డీవోడీ డైరెక్టర్ కే.పొన్నుస్వామి, ఎన్‌ఐటీఐ సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్ బి.అనురాధ బఠాన, ఎన్‌పీఎంయూ పీహెచ్‌ఈ ఆర్‌ఐసీ ధీరేంద్రకుమార్, ఫుడ్‌అండ్ పీడీ సెక్రటరీ ప్రదీప్‌కుమార్, కేంద్ర పశుసంర్ధకశాఖ అధికారి బదౌరియాల బృందం మంగళవారం కరువు పరిస్థితులను తెలుసుకునేందుకు నందికొట్కూరుకు చేరుకుంది. జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయతో కలసి నందికొట్కూ రు రబ్బాని గోదాము సమీపంలోని పత్తి, మొక్కజొన్న పంట లు,తర్తూరులోని రమేష్‌రెడ్డితో పాటు మరికొంత మంది రైతుల మొక్కజొన్న, పత్తి పంటలను పరిశీలించి రైతుల నుంచి పంట నష్టం వివరాలు తెలుసుకొన్నారు. ఏటా మొక్కజొన్న పంట ఎక రాకు 30క్వింటాళ్ల దిగుబడి తీసేవాళ్లమని, ఈ ఏడాది క్వింటా కూడా చేతికందలేని రైతులు కేంద్రం బృందం ఎదుట ఏకరువు పెట్టారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంట నష్టపరిహారం ప్రకటి ంచి ఆదుకోకపోతే అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకోవాల్సి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు వెచ్చించి పంటలకు ఇన్సూరెన్స్ చెల్లించామని,పంటలు దున్నేసినా ఇప్పటిదా కా పరిహారం పైసా మంజూరు చేయలేదని వివరించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ.. తా ము పరిశీలించిన పంటల స్థితిగతులు, రైతులు తెలియజేసిన వివరాల నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తామన్నా రు.పాములపాడు మండలంలోని కృష్ణారావుపేట, ఎర్రగూడూ రు గ్రామాల్లో కలెక్టర్ రాజకుమారి గణియాతో కలసి కేంద్ర బృందం సభ్యులు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఆత్మకూ రు మండలంలో కరువుపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ సందర్శించారు. వీరి వెంట ఆర్డీఓ వెంకటశివ, జిల్లా వ్యవ సాయాధికారి వెంకటేశ్వర్లు వ్యవ సాయశాఖ ఏడీఏ గిరీశ్, ఏఓ కృష్ణారెడ్డి, కేవీకే శాస్త్రవేత్తలు, తహసీల్దార్ చంద్రశేఖర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.


