మున్సిపోల్స్‌లో టీడీపీ రిగ్గింగ్‌ | - | Sakshi
Sakshi News home page

మున్సిపోల్స్‌లో టీడీపీ రిగ్గింగ్‌

Nov 2 2026 2:05 AM | Updated on Nov 2 2026 2:05 AM

మున్సిపోల్స్‌లో టీడీపీ రిగ్గింగ్‌

● బూత్‌లు ఆక్రమించి

యథేచ్ఛగా సైక్లింగ్‌

● డోన్‌లో రిగ్గింగ్‌ చేసుకున్న

కోట్ల సుజాతమ్మ

● బేతంచర్లలో వైఎస్సార్‌సీపీ వారిని

బయటకు లాగి ఓట్లు వేసుకున్న వైనం

● డోన్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట

పార్టీ శ్రేణులతో

బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ధర్నా

● కర్నూలులో పలు పోలింగ్‌ బూత్‌ల్లో

పచ్చ పార్టీ సైక్లింగ్‌

● వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను

అరెస్టు చేయించి

యథేచ్ఛగా దొంగ ఓట్లు

● కాటసాని రాంభూపాల్‌ రెడ్డిని

అదుపులోకి తీసుకుని వాహనం సీజ్‌

● ఎమ్మిగనూరులో సమన్వయకర్త

రాజీవ్‌ రెడ్డి హౌస్‌ అరెస్ట్‌

● పోలీసులను అడ్డుపెట్టి

పచ్చ పార్టీ అక్రమాలు

బేతంచెర్లలో సరస్వతి శిశు మందిరం పోలింగ్‌ కేంద్రంలో ఓటర్లను అడ్డుకుంటున్న టీడీపీ నాయకులు

సాక్షి ప్రతినిధి కర్నూలు: మున్సిపల్‌ పోలింగ్‌లో పచ్చ పార్టీ అక్రమాలకు తెగబడింది. బరితెగించి రిగ్గింగ్‌, సైక్లింగ్‌కు పాల్పడి ప్రజాస్వామ్యానికి పాతరేసింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పలు చోట్ల పచ్చమూకలు పోలీసులతో కలసి ఓటర్లను ఓట్లు వేసుకోనివ్వలేదు. కొన్ని బూత్‌ల్లో వెబ్‌ కెమెరాల సాక్షిగా మహిళల ఓట్లు పురుషులు వేయడం గమనార్హం. కొన్ని మున్సిపాలిటీల్లో పచ్చమూకలు వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బయటకు లాగి రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. పోలీసులే వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను దౌర్జన్యంగా బయటకు పంపి పచ్చ పార్టీకి అనుకూలంగా దొంగ ఓట్లు వేయించారు. మొత్తంగా ఆదివారం జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడింది. ఆదోని, ఎమ్మిగనూరు, గూడూరు, నంద్యాల, నందికొట్కూరు, ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోనూ పలు వార్డుల్లో పచ్చ నేతలు దొంగ ఓట్లు వేశారు. కొన్ని చోట్ల రిగ్గింగ్‌ చేసుకునేందుకు ప్రయత్నించారు. ఇక్కడ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు ప్రతిఘటించడంతో పచ్చ పార్టీ నేతలు వెనక్కు తగ్గారు.

డోన్‌లో కోట్ల సుజాతమ్మ దౌర్జన్యం

డోన్‌ మున్సిపాలిటీలో పచ్చమూకలు యథేచ్ఛగా రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. ఉదయం 7 నుంచి 8 గంటల వరకు గంట పాటు ఓటింగ్‌ సజావుగా సాగింది. ఈలోపు చైర్మన్‌ అభ్యర్థి కోట్ల సుజాతమ్మ పోలీసులను ప్రయోగించి పోటీలో ఉన్న అభ్యర్థుల భర్తలను, ఇతర కుటుంబ సభ్యులను పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ శ్రీనివాసులు ఎదుట కూర్చోబెట్టారు. కొన్ని బూత్‌లలో ఏజెంట్లను సకాలంలో పోలింగ్‌ బూత్‌లకు రాకుండా పోలీసులు అదుపులోకి తీసుకుని సమయం ముగిసిన తర్వాత వదిలిపెట్టారు. 9 గంటల ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాల నుంచి తరలివచ్చిన పచ్చమూకలు మున్సిపాలిటీల్లోని అన్ని వార్డులను ఆక్రమించారు. పోలీసుల సహకారంతో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బయటకు లాక్కొచ్చారు. కొందరిపై చేయి చేసుకున్నారు. ఆ తర్వాత పోలింగ్‌ బూత్‌లలో యథేచ్ఛగా రిగ్గింగ్‌, సైక్లింగ్‌లకు పాల్పడ్డారు. బేతంచెర్ల మున్సిపాలిటీలో సైతం టీడీపీ రిగ్గింగ్‌కు పాల్పడింది. టీడీపీ నాయకుడు ధర్మవరం సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ పచ్చమూకలు వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బూత్‌ల నుంచి బయటకు లాగి కొన్ని చోట్ల రిగ్గింగ్‌, కొన్ని చోట్ల సైక్లింగ్‌కు పాల్పడ్డారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులను పోలింగ్‌ బూత్‌ల వద్దకు రాకుండా పోలీసులు పలుమార్లు లాఠీచార్జీ చేశారు.

ఎమ్మిగనూరులో

రాజీవ్‌రెడ్డి హౌస్‌ అరెస్ట్‌

ఎమ్మిగనూరులో పచ్చ పార్టీ అక్రమాలకు పాల్పడింది. వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్‌రెడ్డిని పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. మున్సిపాలిటీలోని 26, 10 వార్డులలో పచ్చ పార్టీ నేతలు దొంగ ఓట్లు వేసుకున్నారు. విషయం తెలుసుకున్న రాజీవ్‌ రెడ్డి ఇంటి నుంచి పోలింగ్‌ బూత్‌ల వద్దకు చేరుకున్నారు. ఆయన వస్తున్న విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడికి తరలిరావడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు రాజీవ్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 26వ వార్డులో రిగ్గింగ్‌కు పాల్పడుతున్న పచ్చ పార్టీ నేత శేఖర్‌ జోలికి పోలీసులు వెళ్లలేదు.

డోన్‌ బాలికల హైస్కూల్‌లో రిగ్గింగ్‌ను చిత్రీకరిస్తున్న వీడియో గ్రాఫర్‌పై చిందులేస్తున్న పోలీసు అధికారి

నంద్యాల పోలింగ్‌ కేంద్రంలో దర్జాగా కూర్చొని

ఓటర్లను ప్రభావితం చేస్తున్న టీడీపీ నాయకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement