బేతంచెర్ల చరిత్రలో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు. టీడీపీ నేతలు ఎన్నికల్లో ఓటమి భయంతో భయభ్రాంతులు సృష్టించారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసే అవకాశాన్ని కోల్పోయారు. బయటి వ్యక్తులను తెచ్చి ఓట్లు వేయించడం ఎంతవరకు సమంజసం. ఇలాంటి చర్యలు రాజ్యాంగాన్ని అవమానించడమే.
– దూదేకుల దస్తగిరి, బేతంచెర్ల నగర పంచాయతీ వైఎస్సార్‌సీపీ చైర్మన్ అభ్యర్థి
మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. పోలీసులను అడ్డు పెట్టుకుని దౌర్జాన్యాలకు పాల్పడి దొంగ ఓట్లు వేయించుకుంది. డోన్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఓటర్లను భ్రయబ్రాంతులకు గురి చేస్తూ పోలింగ్ నిర్వహించడం ఇదే ప్రథమం. వివిధ ప్రాంతాల నుంచి తమ అనుచరులను రప్పించుకోని సైక్లింగ్ పద్ధతిలో దొంగ ఓట్లకు పాల్పడ్డారు. పోలీసుల సమక్షంలో అరాచకాలకు తెరలేపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ విషయంపై విచారణ చేసి రీపోలింగ్ నిర్వహించాలి.
– రంగనాయుడు, సీపీఐ జిల్లా కార్యదర్శి, డోన్
●


