కర్నూలులో పోలీసుల మద్దతుతో రిగ్గింగ్‌, రీసైక్లింగ్‌ | - | Sakshi
Sakshi News home page

కర్నూలులో పోలీసుల మద్దతుతో రిగ్గింగ్‌, రీసైక్లింగ్‌

Nov 2 2026 2:05 AM | Updated on Nov 2 2026 2:05 AM

● కర్నూలు కార్పొరేషన్‌ ఎన్నికల్లో పచ్చ పార్టీ పోలీసుల మద్దతుతో రిగ్గింగ్‌, రీసైక్లింగ్‌కు పాల్పడింది.

● మంత్రి టీజీ భరత్‌ వాహనంతో పాటు ఆయన కాన్వాయ్‌ను పోలీసులు అడ్డగించలేదు. దీంతో భరత్‌ పోలీసుల సపోర్ట్‌తో నగరంలో కలియదిరిగారు. ఫోన్‌లోనే అనుచరులకు ఆదేశాలిస్తూ హల్‌చల్‌ సృష్టించారు.

● 12వ వార్డులోకి దూరి అక్కడే కూర్చున్నారు. దీంతో పచ్చ పార్టీ నేతలు అక్కడ రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. మంత్రి పోలింగ్‌ బూత్‌లను సందర్శిస్తూ అనుచరులకు ఆదేశాలిస్తూ పెద్ద ఎత్తున రీసైక్లింగ్‌కు పాల్పడ్డారు.

● 15వ వార్డు మొదలు కొని పలు వార్డుల్లో పోలింగ్‌ ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. కొందరు అభ్యర్థులను సైతం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 15వ వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి జలీల్‌ను పోలీసులు స్టేషన్‌కు తరలించడంతో ఇక్కడ పచ్చ పార్టీ నేత బూత్‌లో దూరి రిగ్గింగ్‌కు పాల్పడ్డాడు.

● 20వ వార్డులోనూ దర్జాగా దొంగ ఓట్లు వేసుకున్నారు. 35వ వార్డులోనూ టీడీపీ నేత రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. 61, 65, 7, 8, 9, 10, 11 తో పాటు పలు వార్డుల్లో పచ్చ పార్టీ శ్రేణులు సైక్లింగ్‌ పద్ధతిలో దొంగ ఓట్లు వేసుకున్నారు.

● పోలింగ్‌ బూత్‌ల వద్దే ఓటర్లకు డబ్బులు పంపిణీ చేశారు. అయినా ఏమాత్రం పట్టించుకోని పోలీసులు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను పోలింగ్‌ బూత్‌ల దరిదాపులకు రాకుండా తరిమికొట్టారు.

కాటసాని, ఎస్వీ వాహనాలు సీజ్‌

మేయర్‌ అభ్యర్థి తరపున ప్రచారం నిర్వహించేందుకు నంద్యాల జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డి, కర్నూలు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డిలకు కేటాయించిన వాహనాలకు పోలీసులు ఇచ్చిన అనుమతి పాసులు (స్టిక్కర్లు) తారుమారయ్యాయి. ఎస్వీ మోహన్‌రెడ్డి కారుకు కేటాయించిన స్టిక్కర్‌ను కాటసాని రాంభూపాల్‌ రెడ్డి కారుకు, అలాగే రాంభూపాల్‌ రెడ్డి కారుకు కేటాయించిన స్టిక్కర్‌ను ఎస్వీ మోహన్‌రెడ్డి కారుకు అతికించుకుని తిరుగుతుండటంతో పోలీసులు ఆ చిన్న కారణం సాకుగా చూపి ఇరువురి వాహనాలను స్వాధీనం చేసుకుని సీజ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement