నంద్యాల(అర్బన్): వాల్మీకి మహర్షి రచించిన రామాయణ మహాకావ్యం సమస్త మానవాళికి ఆదర్శమని ఎస్పీ సునీల్‌షెరాన్ తెలిపారు. వాల్మీకి మహర్షి జయంతిని పురస్కరించుకొని సోమవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత వాల్మీకి మహర్షి వంటి మహానీయుల జీవిత చరిత్రలను తెలుసుకోవాలన్నారు. గొప్ప మానవతా విలువలు, ఉన్నతమైన ఆదర్శ భావాలను బోధించే రామాయణం వంటి మహాకావ్యాన్ని రచించి సమాజానికి అందించిన వాల్మీకి మహర్షి చూపిన దారిలో మనందరం నడవాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఖాదర్‌బాషా, చిన్నికృష్ణ, శ్రీనివాసరావు, వీరన్న, బాబు, సురేష్, హర్షవర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


