శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానంలోని హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా నగదు రూపేణా రూ.4,22,29,240 లభించినట్లు శ్రీశైల దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగుంట రమేష్‌నాయుడు, ఈఓ శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం ఆలయంలోని అలంకార మండపంలో 32రోజుల్లో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు. నగదుతో పాటు బంగారం 75 గ్రాముల 300 మిల్లీగ్రాములు, వెండి 2 కేజీల 900గ్రాములు లభించింది. అలాగే యుఎస్ఏ డాలర్లు 417, యుఏఇ దిర్హమ్స్ 65, ఇంగ్లాడ్ పౌండ్స్ 60, కెనడా డాలర్లు 100, ఓమన్బైసా 500, ఓమన్ రియాల్ 1, యూరోస్ 25, మలేషియా రింగిట్స్ 2, సౌదీరియాల్స్ 10, న్యూజిలాండ్ డాలర్లు 10, సింగపూర్ డాలర్లు 2, ఈజిఫ్ట్ పౌండ్స్ 10 లభించాయి. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాలో లెక్కింపును చేపట్టారు. డీఈవో ఎస్.చంద్రశేఖర్, పలు విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.


