మంత్రి ఇంటి పక్కనే బడిని ఎత్తేశారు! | - | Sakshi
Sakshi News home page

మంత్రి ఇంటి పక్కనే బడిని ఎత్తేశారు!

Oct 27 2026 1:20 AM | Updated on Oct 27 2026 1:20 AM

● మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి

బొమ్మలసత్రం: నంద్యాల పట్టణంలోని బైర్మల్‌ వీధిలో మంత్రి ఎన్‌ఎమ్‌డీ ఫరూక్‌ ఇంటి పక్కనే ఏళ్ల చరిత్ర కలిగిన సత్రం బడిని ఎత్తేశారని, ఈ దుస్థితిని చంద్రబాబు పాలనలో చూస్తున్నామని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం పట్టణంలోని 7, 8, 10, 11 వార్డుల్లో కౌన్సిలర్‌ అభ్యర్ధుల గెలుపు కోసం ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా, చైర్మన్‌ అభ్యర్ధి డాక్టర్‌ దాల్‌మిల్‌ అమీర్‌బాషాలతో కలసి శిల్పా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణంలో పెద్ద పెద్ద వ్యక్తులు విద్యను అభ్యసించి గొప్ప ఉన్నత శిఖరాలకు చేర్చిన సత్రం బడికి ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. ఇంటి సమీపంలో ఉన్న సత్రం బడిని మంత్రి పట్టించుకోక పోవటం వల్లే మూతపడాల్సి వచ్చిందన్నారు. నంద్యాల ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాల్లో పనికావాలంటే టీడీపీ నేతలకు రూ. 20 వేల నుంచి రూ. 30 వేల వరకు లంచం చెల్లించాల్సి వస్తోందన్నారు. తిరుమలలో దర్శనానికి సిఫార్సు లేఖ కావాలన్నా డబ్బులు ఇవ్వాల్సిన దుస్థితి నెలకొందన్నారు. నంద్యాలలో బలిజ, వైశ్య కులస్తులకు సంబంధించిన ఆస్తుల కోసం దాడులు చేసి వారిపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. ఏడాదికి నాలుగు ఉచిత సిలిండర్లు ఇస్తామని ఎన్నికల సమయంలో నమ్మించి ఇంత వరకు ఒక్కటి కూడా ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేశారన్నారు. నిరుద్యోగ భృతి రూ. 3వేలు అందిస్తామని నమ్మించి ఒక్కపైసా కూడా చెల్లించలేదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క పేదవాడికి కూడా సెంటు భూమి ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నంద్యాలకు నీటి కొరత లేకుండా చేశాం..

తాము అధికారంలో ఉన్న సమయంలో అమృత్‌ పథకం ద్వారా వెలుగోడు రిజర్వాయర్‌ నుంచి పైపులైన్‌ ద్వారా నేరుగా నంద్యాల ప్రజల ఇళ్ల వద్దకు నీరు వచ్చేలా చేశామన్నారు. కరోనా కాలంలోె అప్పటి ఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రజలకు అండగా నిలించిందని గుర్తుచేశారు. వార్డుల్లో వలంటరీలు ప్రాణాలకు తెగించి ఇంటింటికి తిరిగి పేదలకు అండగా నిలిచారన్నారు. సేవ చేసేవారికే ఓటు వేసి గెలింపుచుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 7వ వార్డు కౌన్సిలర్‌ అభ్యర్ధి ఏజాజ్‌ హుస్సేన్‌, 8 వార్డు షేక్‌ అబ్దుల్‌ మజీద్‌, 10 వ వార్డు అభ్యర్ధి దండే సుధాకర్‌, 11వ వార్డు అభ్యర్ధి అబ్ధుల్‌ కలామ్‌బాషా, 9వ వార్డు ఆంకాలమ్మలకు ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలన్నారు. అలాగే ఛైర్మన్‌ అభ్యర్ధి డాక్టర్‌ దాల్‌మిల్‌ అమీర్‌బాషాను గెలిపించాలని కోరారు.

ఫ్రూట్‌మార్కెట్‌ వ్యాపారులకు

అండగా నిలిచాం..

కూరగాయల మార్కెట్‌లో ఉన్న ఫ్రూట్‌మార్కెట్‌ గతంలో అగ్రిప్రమాదంలో కాలిపోయి వ్యాపారులకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా అన్నారు. మాజీ ఎమ్మెల్యే శిల్పారవి చొరవతో రూ.25 లక్షల ఆర్ధిక సహాయాన్ని కేవలం 15 రోజుల్లో అందించామన్నారు. ఈవిషయంలో ఎన్‌ఎమ్‌డీ ఫరూక్‌ను సహాయ, చేయమని అడిగితే తమ వద్ద ఏమిలేదని అన్నీ వైఎస్సార్‌సీపీ నేతలే చూసుకోవాలని చెప్పడం భాధాకరమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement