ఇంటింటికీ శుద్ధ జలం అందించాం | - | Sakshi
Sakshi News home page

ఇంటింటికీ శుద్ధ జలం అందించాం

Oct 27 2026 1:20 AM | Updated on Oct 27 2026 1:20 AM

డోన్‌: తాము అధికారంలో ఉన్న సమయంలో రూ.400 కోట్ల వ్యయంతో వాటర్‌ గ్రిడ్‌ పథకం ద్వారా గోరుకల్లు రిజర్వాయర్‌ నుంచి ఇంటింటికీ శుద్ధజలం అందించామని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా డోన్‌ పట్టణంలోని 29, 33, 34, 35, 36 వార్డుల్లో సోమవారం ఆయన విసృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా స్థానికులను ఎన్నుకుంటే నిత్యం అందుబాటులో ఉండి ప్రజాసేవ చేయగలుతారన్నారు. స్థానికేతరులను గెలిపిస్తే ప్రజాసేవ కనుమరుగై అభివృద్ధి పనులకు ఆటంకం ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. అభివృద్ధికి, అవినీతికి మధ్యనే పోటీ జరుగుతోందని, టీడీపీ నేతలను గెలిపిస్తే ప్రజలను నిలువుదోపిడీ చేస్తారని హెచ్చరించారు.

టీడీపీలో బీసీలకు వెన్నుపోటు

డోన్‌ను రూ.4 వేల కోట్లతో తాము అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి మోడల్‌ నియోజకవర్గంగా తీర్చిదిద్దామన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం, ఇసుక మాఫియా, అక్రమ మైనింగ్‌తో అవినీతి రాజ్యమేలుతోందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పి వెన్నుపోటు పొడిచారన్నారు. ఓటుతో ఆ పార్టీకి బుద్ధిచెప్పాలన్నారు. బుగ్గన వెంట మార్కెట్‌ యార్డ్‌ మాజీ చైర్మెన్‌ మల్లెంపల్లె రామచంద్రుడు, పార్టీ పట్టణ అధ్యక్షుడు మల్లికార్జునరెడ్డి, ముస్లిం మైనారిటీ నాయకులు అక్బర్‌ బాషా, పార్టీ చైర్‌ పర్సన్‌ అభ్యర్థి బోయ చైతన్య, కౌన్సిల్‌ అభ్యర్థులు చిన్ని, గడ్డం దుర్గ, దారా లక్ష్మిదేవి, మహేష్‌, మాజీ కౌన్సిలర్లు మేకల విమల, మేకల రాజు, పార్టీ జిల్లా వలంటీర్‌ విభాగం అధ్యక్షుడు పోస్ట్‌ ప్రసాద్‌, పార్టీ నాయకులు మోహన్‌రెడ్డి, రైల్వే నాయుడు, గడ్డం సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇప్పుడు అభివృద్ధికి,

అవినీతికి మధ్యనే పోటీ

టీడీపీ నేతలను గెలిపిస్తే

ప్రజలను నిలువుదోపిడీ చేస్తారు

మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement