కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డుకు సోమవారం 2,871 క్వింటాళ్ల(89 లాట్లు) ఉల్లి విక్రయానికి వచ్చింది. కనిష్ట ధర రూ.1,015, గరిష్ట ధర రూ.4,529 లభించగా.. సగటు ధర రూ.3,741 నమోదైంది. రీటైల్ మార్కెట్‌లో కిలో ఉల్లి ధర రూ.60–70 వరకు ఉంటోంది. కిలో 32 ప్రకారం ఉల్లి గడ్డలు పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఆ ఊసే లేకుండా పోయింది. వేరుశనగకు కనిష్ట ధర రూ.4,512, గరిష్ట ధర రూ.9,416 లభించగా.. సగటు ధర రూ.9,016 నమోదు అయింది. మొక్కజొన్నలకు రూ.2,550 ధర లభించింది.


