మహానంది: కాణిపాకంలో వెలిసిన వరసిద్ధి వినాయకస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ మహానందీశ్వరస్వామి దేవస్థానం తరపున సోమవారం పట్టువస్త్రాలు సమర్పించారు. ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి, ట్రస్ట్‌బోర్డు చైర్మన్ నరాల చంద్రమౌళీశ్వరరెడ్డి, ఏఈఓ ఎరమల మధు, ఆలయ సూపరింటెండెంట్ అంబటి శశిధర్‌రెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యుల ఆధ్వర్యంలో కాణిపాకం దేవస్థానానికి చేరుకోగా కాణిపాకం ఈఓ మణినాయుడు, ఏఈఓ వేల్పుల ధనుంజయ, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ మేరకు మేళతాళాలు, వాయిద్యాల నడుమ స్వామివారికి పట్టువస్త్రాలు అందించారు. అనంతరం మహానంది ఈఓ శ్రీనివాసరెడ్డితో పాటు చైర్మన్, ధర్మకర్తల మండలి సభ్యులకు శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయకుడి ప్రసాదాలు, చిత్రపటాలు అందించి వేదాశీర్వచనం చేశారు.
కరువు నష్టంపై
నివేదిక పంపుతాం
నందికొట్కూరు: ఖరీఫ్ సీజన్‌లో కరువుతో వాటిల్లిన పంట నష్టంపై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని జిల్లా స్పెషల్ ఆఫీసర్, వెటర్నరీ జేడీ పీ. వెంకటరమణ స్పష్టం చేశారు. సోమవారం నందికొట్కూరు, మిడుతూరు మండలాల్లో ఖరీఫ్‌లో వేసిన ఎండిన మొక్కజొన్న, పత్తి, మినుము, కంది, తదితర పంటలను జిల్లా ప్రాంతీయ పరిశోధన శాస్త్రవేత్తల బృందం పరిశీలించారు. రైతులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో మొక్కొజొన్న పంట పూర్తిగా ఎండిపోయిందన్నారు. రబీ సీజన్‌లో వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా, తక్కువ నీటిని వినియోగించే పంటలు సాగు చేయాలని రైతులకు సూచించారు. ఈయన వెంట ఏడీఏహెచ్ వరప్రసాద్, ఏడీఏ గిరీష్, శాస్త్రవేత్తలు డాక్టర్ మంజునాథ్, డాక్టర్ రవి ప్రకాష్, డాక్టర్ సతీష్ పాల్గొన్నారు.
శ్రీశైల దేవస్థానానికి రూ.2లక్షల విరాళం
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న అన్న ప్రసాద వితరణ పథకానికి ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన వి.వెంకట శివరామకృష్ణ ప్రసాద్ అన్నప్రసాద వితరణ పథకానికి రూ.లక్ష, ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన వి.రాకేష్ కుమార్ గో సంరక్షణ పథకానికి రూ.లక్ష విరాళాన్ని సహాయ కార్యనిర్వహణాధికారి యం.ఫణిధరప్రసాద్‌కు అందజేశారు. దాతలకు రసీదు, ప్రసాదాలు అందజేశారు.
ప్రాసెసింగ్ యూనిట్లకు
ప్రత్యేక టీమ్‌లు
కర్నూలు(అగ్రికల్చర్): పప్పు శనగ ప్రాసెసింగ్ యూనిట్ల తనిఖీలకు ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేస్తూ జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. రబీ సీజన్‌కు సంబంధించి కర్నూలు జిల్లాకు 25వేలు, నంద్యాల జిల్లాకు 17వేల క్వింటాళ్ల శనగ విత్తనాలను కేటాయించింది. ప్రాసెసింగ్‌కు కర్నూలులో ఏపీ సీడ్స్ సహా ఆరు యూనిట్లు ఉన్నాయి. ఒక్కో ప్రాసెసింగ్ యూనిట్‌కు మానిటరింగ్ అధికారిగా ఏఓలను, సూపర్‌వైజింగ్ అధికారిగా అగ్రానమీ ఏడీఏ రాజశేఖర్ నియమితులయ్యారు. ప్రాసెసింగ్ ప్రక్రియను ఎప్పటికప్పడు పర్యవేక్షిస్తూ సలహాలు, సూచనలు ఇచ్చేందుకు డీడీఏ బాలాజీ నాయక్ నేతృత్వంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటైంది. ప్రాసెసింగ్ యూనిట్ల మానిటరింగ్ అధికారులుగా ఏవోలు రాజకిశోర్, పాపిరెడ్డి, రామకృష్ణ, కిరణ్ వ్యవహరిస్తారు. కాగా సోమవారం అగ్రానమీ ఏడీఏ రాజశేఖర్, కర్నూలు ఏడీఏ దస్తగిరిరెడ్డి, కల్లూరు ఏవో విష్ణువర్థన్‌రెవవ్డి, కర్నూలు ఏవో రూఫస్‌రొనాల్డ్ చక్రసీడ్స్, మురళీధర్ సీడ్స్, ఏపీ సీడ్స్‌ల్లో తనిఖీలు చేశారు.


