పాఠశాల ఎన్నికలకు వేళాయె.. | - | Sakshi
Sakshi News home page

పాఠశాల ఎన్నికలకు వేళాయె..

Sep 28 2026 7:21 AM | Updated on Sep 28 2026 7:21 AM

రేపు స్కూల్‌ మేనేజ్‌ మెంట్‌ కమిటీ ఎన్నికలు

జిల్లాలో 1,392 పాఠశాలలు

తల్లిదండ్రుల వివరాల సేకరణలో ఆశావాహులు

నంద్యాల(న్యూటౌన్‌): జిల్లాలోని ప్రభుత్వ పాఠశా లల అభివృద్ధి, మౌలిక వసతులు, ప్రభుత్వ పథకాల అమలు, విద్యార్థుల సంక్షేమం, విద్యాప్రమాణాల మెరుగుదలలో స్కూల్‌ మేనేజ్‌ మెంట్‌ కమిటీ లు కీలకం. దీంతో ఈ కమిటీల్లో స్థానం కోసం ఆశావహులైన తల్లిదండ్రులు సైతం నేతలను ఆశ్రయిస్తున్నారు. నాయకులు సైతం తమకు అనుకూలమైన వ్యక్తులు పదవుల్లో ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నా రు. కొందరు ఇప్పటికే నాయకుల చుట్టూ తిరుగుతుండగా, మరికొందరు తల్లిదండ్రులను కూడగట్టే పనిలో నిమగ్నమయ్యారు. ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు డీఈవో జనార్దన్‌రెడ్డి, సమగ్రశిక్ష శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలోని 1,392 ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో ఓటర్ల జాబితాను ప్రదర్శిస్తారు. అభ్యంతరాలు, మార్పులు, చేర్పులు, పరిశీలన అనంతరం 25న తుది ఓటర్ల జాబితాను ఖరారు చేశారు. ఈ నెల 29వ తేదీన అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 1023, ప్రాథమికోన్నత పాఠశాలలు 27, ఉన్నత పాఠశాలలు 342 ఉన్నాయి. వీటిలో 1,33,148 మంది విద్యార్థులు ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు విద్యనభ్యసిస్తున్నారు.ఈ విద్యార్థుల తల్లిదండ్రులు తమ ఓటు హక్కును ఎన్నికల్లో వినియోగించుకోనున్నా రు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

నూతన కమిటీ పదవీ కాలం రెండేళ్లు

విద్యార్థుల సంఖ్యను బట్టి ఒక్కో పాఠశాలలో 12 నుంచి 25 మంది సభ్యులతో యాజమాన్య కమిటీ ఏర్పడుతుంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, నిబంధనల ప్రకారం ఇతర సభ్యులు ఇందులో ఉంటారు. నూతన కమిటీ పదవీకాలం రెండేళ్లు ఉంటుంది. పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల సంక్షేమంలో కమిటీలు బాధ్యత వహించాల్సి ఉంటుంది. 2024 ఆగస్టు 8న పాఠశాల యాజమాన్య కమిటీల ఎన్నికలు నిర్వహించారు. రెండేళ్ల పదవీకాలం ఈ నెల 8వ తేదీతో ముగిసింది. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు జరుగుతుండటంతో బడి కమిటీల ఎన్నికలకు రాజకీయ ప్రాధాన్యం పెరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement