‘స్థానిక’ సమరంలో సత్తా చాటుదాం | - | Sakshi
Sakshi News home page

‘స్థానిక’ సమరంలో సత్తా చాటుదాం

Sep 21 2026 6:47 AM | Updated on Sep 21 2026 6:47 AM

బేతంచెర్ల: త్వరలో జరిగే స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ సత్తా చాటుదామని పార్టీ నాయకులు, కార్యకర్తలకు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని చౌడేశ్వరి దేవి కల్యాణ మండపంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా అందరూ ఇప్పటి నుంచే కృషి చేయాలన్నారు. గత ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి, ప్రస్తుత టీడీపీ ప్రభుత్వంలో హామీల అమలులో తేడాలను ప్రజలకు వివరించాలన్నారు. చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు నాలుగు సార్లు సీఎం అయ్యారని, ప్రతి సారి హామీలను అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారని గుర్తు చేశారు. బాబు అధికారంలో ఉంటే కరువు కాటకాలు వస్తాయనేది మరోసారి రుజువైందన్నారు. సూపర్‌ సిక్స్‌ హామీలో పెన్షన్లు మినహా మిగతా హామీల అమలు ఎక్కడుందని బుగ్గన ప్రశ్నించారు. మహిళలకు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ. 1500, నిరుద్యోగ భృతి, బీసీలకు 50 ఏళ్లకు పింఛన్‌, రైతు భరోసా వంటి హామీల పరిస్థితి ఏమిటని నిలదీశారు. కరువు పరిస్థితుల్లో రైతులకు ఎలాంటి సహా యక చర్యలు చేపట్టలేదని, కూటమి నాయకులకు రైతు సంక్షేమంపై ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం అవుతుందన్నారు. సమావేశంలో ఎంపీపీ బుగ్గన నాగభూషణం రెడ్డి, నగర పంచాయతీ చైర్మన్‌ చలం రెడ్డి, జెడ్పీటీసీ శివ లక్ష్మి, వైస్‌ ఎంపీపీ రంగస్వామి, వివిధ కార్పొరేషన్ల మాజీ డైరెక్టర్లు బాబు రెడ్డి, మూర్తుజావలి, ఖాజా హుసేన్‌, వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రామచంద్రుడు, జిల్లా అధికార ప్రతినిధి మురళీకృష్ణ,నాయకులు బుగ్గన చంద్రారెడ్డి, లక్ష్మిరెడ్డి, నాగేశ్వర్‌ రెడ్డి, శ్రీనాథ్‌ రెడ్డి,యాకోబ్‌, తిరుమలేశ్వర్‌ రెడ్డి, పిట్టల జాకీర్‌, దస్తగిరి, రుద్రవరం నారాయణ, మాజీ సర్పంచ్‌లు వేణుగోపాల్‌ రెడ్డి, వెంకటేశ్వర్లు, యుగంధర్‌ రెడ్డి, తిమ్మయ్య ,యాదగిరి వెంకటేశ్వర్లు అధిక సంఖ్య లో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఏమి చేశారు?

ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్‌ రెడ్డి డోన్‌ నియో జకవర్గానికి చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు వివరించాలన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో గోరుకల్లు రిజర్వాయర్‌ నుంచి రూ. 351 కోట్లతో చేపట్టిన వాటర్‌ గ్రిడ్‌ పథకం ద్వారా 2025 మార్చి నాటికి ఇంటింటికి నీరు అందించాల్సి ఉండగా పర్సెంటేజీల కోసం ఏడాది పాటు పనులు నిలిపివేశారన్నారు. బేతంచెర్ల మండలంలోని గ్రామ గ్రామానికి రోడ్డు సౌక ర్యంతో, జాతీయ రహదారులను నిర్మించామన్నారు. ఎన్నికలు రావడంతో ఎంబాయి, కనుమ కింది కొట్టాల గ్రామ రహదారుల పనులు నిలిచిపోయాయని, కూటమి ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లు గడిచినా ఎందుకు పూర్తి చేయలేదన్నారు. మద్దిలేటి నరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులు సుమారు రూ. 55 కోట్లతో చేపట్టినా నత్తనడకన కొనసాగుతున్నాయ ని, ఆలయ ముఖ ద్వారం పనులను ఎందుకు ప్రారంభించ లేదని ప్రశ్నించారు. బేతంచెర్ల మండలంలో ఐటీఐ, ఎంఎస్‌ఎంఈ భవనాలు పూర్తయినా ఎందుకు ప్రారంభించలేదన్నారు. పాలిటెక్నిక్‌ కళాశాల నిర్మాణాన్ని రద్దు చేశారని, మూత బడిన పాణ్యం సిమెంట్‌ ఫ్యాక్టరీని గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పునరుద్ధరణకు కృషి చేస్తే ప్రస్తుతం ఎందుకు ఉత్పత్తి నిలిచిపోయిందన్నారు. రెండేళ్లలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి.. మద్దిలేటి స్వామి ఆలయానికి వచ్చి ప్రమాణం చేయాలని, తాము ఐదేళ్లలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించేందుకు సిద్ధంగా ఉన్నామని సవాల్‌ విసిరారు.

మోసం చేయడం

సీఎం చంద్రబాబు నైజం

పర్సంటేజీల కోసం అభివృద్ధి పనులు

అడ్డుకుంటారా?

మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement