మల్లన్నకు నృత్య నివేదన | - | Sakshi
Sakshi News home page

మల్లన్నకు నృత్య నివేదన

Sep 21 2026 6:47 AM | Updated on Sep 21 2026 6:47 AM

ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం

శ్రీశైలంటెంపుల్‌: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథం కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆలయ దక్షిణ మాఢవీధిలోని నిత్యకళావేదికపై హైదరాబాద్‌కు చెందిన లావణ్య బృందం వారి సంప్రదాయ నృత్యప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది. గణపతికౌత్వం, నమశ్శివాయ, హర హర శంభో, మూషికవాహన, తాండవనృత్యం, అఖిలాండేశ్వరి, శంభో శివశంభో తదితర గీతాలకు అక్షర, అక్షిత, నిత్యశ్రీ, వేదాంశిక, సహస్ర, నక్షత్ర, పవిత్ర తదితరులు నృత్యం ప్రదర్శించారు.

23న జాబ్‌మేళా

నంద్యాల (న్యూటౌన్‌): స్థానిక పీఎస్‌సీ అండ్‌ కేవీఎస్‌సీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జవహర్‌ నాలెడ్జ్‌ సెంటర్‌ (జేకేసీ) ఆధ్వర్యంలో ఈ నెల 23 తేదీన జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ శశికళ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. వివిధ రంగాలకు చెందిన 10 ప్రముఖ సంస్థలు పాల్గొని అర్హత కలిగిన అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు వివరించారు. విద్యార్హతలను బట్టి నెలకు రూ.14 వేల నుంచి రూ.25 వేల వరకు వేతనం లభిస్తుందన్నారు. నంద్యాల, కర్నూలు, కడప, హైదరాబాద్‌, విశాఖపట్నం, నెల్లూరు (నాయుడుపేట), శ్రీకాళహస్తి, శ్రీ సిటీ, హోసూర్‌ తదితర ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశా లు ఉన్నాయన్నారు. వివరాలకు జేకేసీ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ రమేష్‌ కుమార్‌ (7799337695, 9703377803)ను సంప్రదించవచ్చన్నారు.

నందికొట్కూరు: శ్రీశైలం ప్రాజెక్టులో సర్వం కోల్పోయిన ముంపు బాధితుల కోసం ఎన్టీఆర్‌ తెచ్చిన 98 జీఓ కింద ఉద్యోగాలు ఇవ్వకుండా సీఎం చంద్రబాబు మోసం చేయడం దారుణమని నీటిముంపు నిరుద్యోగ సంఘం నాయకులు జయన్న ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలోని కర్నూలు–గుంటూరు ప్రధాన రహదారిపై శ్రీశైలం నీటిముంపు నిరుద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష ఆదివారం 179 రోజుకు చేరింది. ఆయన మాట్లాడుతూ అధికారంలోకి రాగానే ఉద్యోగాలు ఇస్తామని చెప్పి సీఎం చంద్రబాబు, ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే జయసూర్య పటేల్‌ సెంటర్‌లో వేలాది ప్రజల మధ్య మాట ఇచ్చి మోసం చేశారని ఆరోపించారు. మౌలాలి, చంద్రన్న, నాగేంద్ర, నాగముని, నాగసుంకన్న, జమ్మన్న, సామేల్‌ తదితరులు దీక్షలో కూర్చొన్నారు.

జిల్లా పరిషత్‌ ప్రత్యేక అధికారిగా కలెక్టర్‌

నంద్యాల(న్యూటౌన్‌): ప్రస్తుత జిల్లా పరిషత్‌ పాలకవర్గాల పదవీకాలం ఈనెల 24 తేదీతో ముగియనున్న నేపథ్యంలో ఈనెల 25వ తేదీ నుంచి జిల్లా పరిషత్‌ ప్రత్యేక అధికారిణిగా కలెక్టర్‌ రాజకుమారి కొనసాగనున్నారు. ఈ మేరకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి (ఎన్నికలు–నియమాలు) శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకం ఈనెల 25వ తేదీ నుంచి ఆరు నెలల కాలానికి లేదా ఎన్నికైన జిల్లా పరిషత్‌ సభ్యులు, చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ తదితర పదవీ బాధ్యతలు స్వీకరించే తేదీ వరకు అమలులో ఉంటుంది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ జి.రాజకుమారి మాట్లాడుతూ.. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు జిల్లా పరిషత్‌కు సంబంధించిన పరిపాలనా వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, ప్రజలకు అందాల్సిన సేవలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా పరిషత్‌ పరిధిలోని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో శాఖల మధ్య సమన్వయంతో ముందుకు సాగుతామని పేర్కొ న్నారు. అలాగే మండల పరిషత్‌ పాలకవర్గాల పదవీకాలం కూడా ఈనెల 24తో ముగియనున్న నేపథ్యంలో 25వ తేదీ నుంచి ప్రత్యేక అధికారుల ద్వారా పరిపాలన కొనసాగనుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement