వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను పరామర్శించిన కాటసాని | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను పరామర్శించిన కాటసాని

Sep 21 2026 6:47 AM | Updated on Sep 21 2026 6:47 AM

కల్లూరు: కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కార్యకర్తలను వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి పరామర్శించారు. ఓర్వక ల్లు మండలం హుసేనాపురం గ్రామానికి చెందిన వడ్డే చంద్రమోహన్‌ గడ్డి మందు తాగి కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. విష యం తెలుసుకున్న కాటసాని ఆస్పత్రికి వెళ్లి చంద్రమోహన్‌ను పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. గుడుంబాయి తండాకు చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఎన్‌. రాజు నాయక్‌ పాముకాటుకు గురై ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న కాటసాని రాంభూపాల్‌రెడ్డి వెళ్లి పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులు కాటసాని సూచించారు. ఆయా గ్రామాలకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement