నంద్యాల(న్యూటౌన్): ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రజలకు విశిష్ట సేవలు అందించినందు కు జిల్లా కలెక్టర్ రాజకుమారికి రెడ్‌క్రాస్ బంగారు పతకం, ప్రశంసా పత్రం లభించింది. మంగళవారం విజ యవాడలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర వార్షిక సర్వసభ్య సమావేశంలో 2024–25 సంవత్సరానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో రెడ్‌క్రాస్ ద్వారా విశిష్ట సేవలు అందించిన కలెక్టర్లను రాష్ట్ర గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ సత్కరించారు. నంద్యాల జిల్లాలో రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో బ్లడ్ స్టోరేజ్ యూనిట్ ఏర్పాటు, ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రం ప్రారంభం, ‘మీ ఇంటికి మీ డాక్టర్’ కార్యక్రమం అమలు తదితర ప్రజోపయోగ కార్యక్రమాలను సమర్థవంతంగా అమ లు చేసినందుకు కలెక్టర్ రాజకుమారికి ఈ పురస్కారం లభించింది.


