మాజీ ఎమ్మెల్యే గంగుల గృహ నిర్బంధం | - | Sakshi
Sakshi News home page

మాజీ ఎమ్మెల్యే గంగుల గృహ నిర్బంధం

Sep 4 2026 7:23 AM | Updated on Sep 4 2026 7:23 AM

మాజీ ఎమ్మెల్యే గంగుల గృహ నిర్బంధం ● కర్నూలు జిల్లాలో 3,30,482 హెక్టార్లు, నంద్యాల జిల్లాలో 1,00,094 హెక్టార్లకు బీమా

ఆళ్లగడ్డ: మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పిలుపు మేరకు వెలుగోడు రిజర్వాయర్‌ సందర్శనకు వెళ్లేందుకు సిద్ధమైన ఆయనను మంగళవారం ఉదయం పట్టణ పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయని బయటకు వెళ్లేందుకు వీల్లేదని అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. రిజర్వాయర్‌ సందర్శనకు వెళ్తే కూడా ప్రభుత్వం ఎందుకు బెంబేలెత్తుందో అర్థం కావడం లేదన్నారు. వెలుగోడు రిజర్వాయర్‌ నుంచి తెలుగుగంగ, కేసీ కెనాల్‌ ఆయకట్టుకు నీరు విడుదల చేయాలని ప్రశ్నిస్తే పోలీసులతో గృహ నిర్భంధం చేయడం సమంజసం కాదన్నారు. పోలీసుల అడ్డంకులు సృష్టించినా రైతుల పక్షాన తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

ఉరుకుంద హుండీ ఆదాయం రూ.1.41కోట్లు

కౌతాళం: జిల్లాలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాల్లో ఒకటైన ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయంలో శ్రావణమాసం మూడవ గురు, సోమవారాలకు సంబంధించి ఆరు రోజుల హుండీని మంగళవారం లెక్కించారు. ఆలయ డిప్యూటీ కమిషనర్‌ వాణి ఆధ్వర్యంలో లెక్కింపు కార్యక్రమం చేపట్టారు. నగదు రూపంలో రూ.1,41,05,560 రాగా.. వెండి 25 కేజీల 300 గ్రాములు, బంగా రం 16 గ్రాముల 980 మిల్లీగ్రాములు వచ్చినట్లు ఈఓ వెల్లడించారు. అలాగే యుఎస్‌ఏ డాలర్లు 8 వచ్చాయన్నారు. లెక్కింపు కార్యక్రమంలో హుండీ పర్యవేక్షణాధికారి కమలాకర్‌, దేవాలయ సిబ్బ ందితో పాటు ప్రధాన అర్చకుడు ఈరప్పస్వామి, ఉపప్రధాన అర్చకుడు మహదేవస్వామి, ముఖ్యఅర్చకులు, ఆలయ పర్యవేక్షకులు వెంకటేష్‌, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.

పీఆర్‌ ఎస్‌ఈగా కేజేఎస్‌ చంద్రారెడ్డి బాధ్యతల స్వీకరణ

కర్నూలు(అర్బన్‌): పంచాయతీరాజ్‌ పర్యవేక్షక ఇంజనీరుగా కేజేఎస్‌ చంద్రారెడ్డి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్క డ ఎస్‌ఈగా విధులు నిర్వహించిన జి.ప్రభాకర్‌రెడ్డి గత ఆగస్టు 31న పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో నెల్లూరు జిల్లా పీఆర్‌ క్వాలిటీ కంట్రోల్‌ విభాగంలో ఈఈగా విధులు నిర్వహిస్తున్న కేజేఎస్‌ చంద్రారెడ్డికి ఎస్‌ఈగా పదోన్నతి కల్పించి ఇక్కడకు పోస్టింగ్‌ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే నూతన ఎస్‌ఈని ఇంజినీర్లు కలిసి పూలబొకేలతో అభినందనలు తెలిపారు.

ముగిసిన బీమా గడువు

కర్నూలు(అగ్రికల్చర్‌): ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లాలో 3,48,390 హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. ఈ సీజన్‌కు సంబంధించి వాతావరణ ఆధారిత బీమా కింద వేరుశనగ, పత్తి.. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన కింద వరి, మొక్కజొన్న, కందులు, జొన్న, ఆముదం, మిర్చి, కొర్ర, సజ్జ, ఉల్లి నోటిఫై అయ్యాయి. వాతావరణ ఆధారిత బీమా కింద ప్రీమియం చెల్లింపు గడువు జూలై చివరితో పూర్తి కాగా.. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా కింద ప్రీమియం చెల్లింపు గడువు ఆగస్టు 31తో ముగిసింది. నోటిఫై చేసిన పంటలు 3,40,842 హెక్టార్లలో సాగయ్యాయి. ఇందులో 3,30,482.74 హెక్టార్లకు ప్రీమియం చెల్లించినట్లు స్పష్టమవుతోంది. మొత్తం 2,86,322 మంది రైతులు ప్రీమియం చెల్లించారు. నంద్యాల జిల్లాలో వాతావరణ ఆధారిత బీమా, ప్రధానమంత్రి ఫసల్‌ బీమా కింద 1,00,094 హెక్టార్లకు ప్రీమియం చెల్లించారు. ఈ జిల్లాలో 1,48,546 మంది రైతులు పంటల బీమా చేసుకోగా.. ఇందులో బ్యాంకుల నుంచి రుణాలు పొందిన రైతులు 6,725 మంది ఉండగా.. నాన్‌ లోని ఫార్మర్స్‌ 1,41,821 మంది ఉండటం గమనార్హం.

క్వింటా ఉల్లి రూ.4,139

కర్నూలు(అగ్రికల్చర్‌): ఎల్‌నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా ఉల్లి సాగు తగ్గిపోవడంతో కొరత ఏర్పడుతోంది. కర్నూలు జిల్లాలో 19,241 హెక్టార్ల సాధారణ సాగు ఉండగా కేవలం 4,988 హెక్టార్లలో సాగయింది. మార్కెట్‌కు ఉల్లి తక్కువగా వస్తోంది. కేవలం 686 క్వింటాళ్ల ఉల్లిగడ్డలు మార్కెట్‌కు రాగా కనిష్టంగా రూ. 2,393, గరిష్టంగా రూ.4,139 ధర లభించగా.. సగటు ధర రూ.3,839 నమోదైంది. కర్నూలు మార్కెట్‌లో వేరుశనగ ధర క్వింటాకు గరిష్ట ధర రూ.9,329, ఆదోని మార్కెట్‌లో రూ.8,999 ప్రకారం ధర లభించింది. ఆదోని మార్కెట్‌కు పత్తి 1,064 క్వింటాళ్లు వచ్చింది. కనిష్ట ధర రూ.5,469, సగటు ధర రూ.9,769 పలికింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement