కౌతాళం: తుంగభద్ర నది పరివా హకంలో వేర్వేరు చోట్ల రెండు భా రీ మొసళ్లను స్థా నికులు బంధించారు. కౌతాళం మండలం మేళిగనూరు గ్రామ సమీపంలోని రామలింగేశ్వర దేవాలయం వెనుక భాగంలో గుంతలో ఉన్న భారీ మొసలి ఉండటంతో గ్రామస్తులు కొన్ని రోజులుగా భయాందోళన చెందుతున్నారు. కాగా నదిలో నీటి ప్రవాహం తగ్గడంతో బుధవారం గుంతలో ఉన్న మొసలిని పెద్ద పెద్ద తాళ్లతో బంధించారు. ఈ విషయాన్ని అదోని అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో ఫారెస్ట్ ఆఫీసర్ తేజశ్వని ఆధ్వర్యంలో సిబ్బంది అక్కడికి చేరుకుని ప్రత్యేక వాహనంలో మొసలిని తీసుకెళ్లారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న చోట వదిలేస్తామని చెప్పారు.
నాగలదిన్నె బ్రిడ్జి వద్ద..
నందవరం: నాగలదిన్నె గ్రామంలో తుంగభద్ర నది బ్రిడ్జి వద్ద గుంతలో ఉన్న మొసలిని బుధవారం రైతులు బంధించారు. నదిలో నీరు లేకపోవడంతో మోటర్ ద్వారా గుంతలోని నీటి పంపు చేయడానికి వెళ్లారు. వరదల్లో కోట్టుపోయిన పాత బ్రిడ్జి పిల్లర్ వద్ద గుంతలో నీటి తోడేందుకు రైతులు విద్యుత్ మోటర్ వేశారు. నీటి తోడే సమయంలో గుంతలో మొసలి బయటపడింది. వెంటనే రైతులు తాళ్లతో మొసలిని బంధించి తెలంగాణపైపు తుంగభద్ర నది గుంతల్లో వదిలేశారు.


