● డీలర్‌ను కఠినంగా శిక్షించాలి
జూపాడుబంగ్లా: హిందూ దేవుళ్లను కించపరిస్తే సహించేది లేదని భజరంగ్‌దల్, విశ్వహిందూపరిషత్, భారతీయ జనతా యువమోర్చా, తదితర హిందూ సంఘాల నాయకులు హెచ్చరించారు. హిందూ దేవుళ్లపై పత్రికల్లో రాయలేని విధంగా అసభ్యకర పదాలతో దూషిస్తూ జూపాడుబంగ్లాకు చెందిన ఓ డీలర్ అతని ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. ఈ పోస్టును గమనించిన వివిధ ప్రాంతాల హిందూ సంఘాల నాయకులు గురువారం ఉదయం జూపాడుబంగ్లాకు చేరుకొని డీలర్‌ను నిలదీశారు. ఆయన వారికి ఎదురు తిరగడంతో అతడిని పోలీసులకు అప్పగించారు. అప్పటికే హిందూ సంఘాల ఆందోళన విషయం తెలుసుకున్న ఆత్మకూరు డీఎస్పీ రామాంజనేయనాయక్, సీఐ సుబ్రమణ్యం జూపాడుబంగ్లాకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కాగా డీలర్ పై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కోరుతూ లిఖితపూర్వకంగా ఆయా సంఘాల నాయకులు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని ఆ వ్యక్తిని డీలర్‌గా తొలగించాలని తహసీల్దార్ చంద్రశేఖర్‌నాయక్ వినతి పత్రం అందజేశారు. విషయాన్ని ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు హిందూసంఘాల నాయకులు మాట్లాడుతూ.. హిందువులను, హిందూ దేవుళ్లను దూషించినా, కించపరిచినా ఉపేక్షించేది లేదన్నారు. ఇలాంటి సంఘటనలుపునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నంది కొట్కూరు రూరల్ సీఐ సుబ్రమణ్యం అధ్వర్యంలో పాములపాడు, ముచ్చుమర్రి, బ్రాహ్మణకొట్కూరు, మిడ్తూరు ఎస్‌ఐలు, పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.


