తాటాకు చప్పుళ్లకు భయపడేవారు లేరు | - | Sakshi
Sakshi News home page

తాటాకు చప్పుళ్లకు భయపడేవారు లేరు

Jul 11 2026 7:07 AM | Updated on Jul 11 2026 7:07 AM

ఆళ్లగడ్డ: చర్చకు రమ్మంటే రాకుండా భయపడి పారిపోయారని ఎమ్మెల్యే అఖిలప్రియ వ్యాఖ్యానించడం సరికాదని, ఇక్కడ తాటాకు చప్పుళ్లకు భయపడేవారు లేరని మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఉదయం 10 గంటలకే జిల్లా ఎస్పీకి ఫోన్‌ చేసి సాయంత్రం ఆధారాలతో వస్తా నని చెప్పగా.. రావద్దని, అవసరమైతే కబురు పెడతామని చెప్పడంతో చట్టం, ఎస్సీపై గౌరవంతో బయటకు వెళ్లడం జరిగిందని, భయపడి కాదన్నారు. అహోబిలం సీఏఓనో, మఠం వారినో వెనుకేసుకు రావాల్సిన అవసరం తనకు లేదన్నారు. పుణ్యక్షేత్రంలో జరుగుతున్న దోపిడీపై మాత్రమే మాట్లాడుతున్నామన్నారు. అహోబిలం తలనీలాలు, టోల్‌గేట్‌ వేల పాటల గురించే కాదు.. నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుక, మట్టి, చికెన్‌, బియ్యంతో పాటు చివరకు శిల్ప కళాకారులను సైతం దోచుకున్న విషయాలపై ప్రతి రోజు ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. అహోబిలంలో తలనీలాల విక్రయ అగ్రిమెంట్‌ ఫేక్‌ అయితే మఠం వారు చర్యలు తీసుకునే వారు కదా.. అని మండి పడ్డారు. ప్రజలను మభ్య పెట్టేందుకు సీఏఓను సస్పెండ్‌ చేశారని గాలి మాటలు మాట్లాడటం సరికాదన్నారు. రెండు రోజలుగా తలనీలాల సేకరణ విషయంలో చైన్నెకి చెందిన కాంట్రాక్టర్‌ను, దేవస్థానానికి సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టర్‌ను ఎమ్మెల్యే మనుషులమని బెదిరించిన రెండు ఆడియో రికార్డింగ్‌లు బయటకు వచ్చాయా.. లేదా అని ప్రశ్నించారు. వాటితో ఎమ్మెల్యేకు సంబంధం లేకపోతే ఫోన్‌లో బెదిరించిన వారిపై ఎందుకు కేసు పెట్టలేదని నిలదీశారు. ఎస్పీని కలిసినప్పుడు ఆడియో రికార్డులతో తనకు సంబంధం లేదని, విచారణ చేయాలని ఎందుకు కోరలేదన్నారు. అహోబిలంలో జరుగుతున్న దోపిడీపై సీఐడీ విచారణకు సిద్ధమైతే ఎమ్మెల్యే ప్రభుత్వానికి లేఖ రాయాలని సూచించారు.

ఎమ్మెల్యే అఖిలప్రియ అవినీతి,

దోపిడీని ప్రశ్నిస్తాం

అహోబిలంలో దోపిడీపై

సీఐడీ విచారణకు సిద్ధమా?

మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement