పేద విద్యార్థుల విద్య కోసం దాతలు దానంగా ఇచ్చిన స్థలాలను ఆక్రమించుకుంటూ పోతే భవిష్యత్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. గ్రామస్తులు, అధికారులు, దాత రామకృష్ణమూర్తి శర్మ కుటుంబీకులు స్పందించి ఆక్రమణల నుంచి పాఠశాల స్థలాన్ని కాపాడాలి. దాత లక్ష్యాన్ని నెరవేర్చాలి.
– ఎంఆర్ నాయక్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి
వేసవి సెలవులు అనంతరం పాఠశాల పునఃప్రారంభం రోజు వచ్చి చూసేసరికి మా పాఠశాల స్థలంలో నిర్మాణం జరుగుతుండటంతో ఎంఈఓకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చా. ఆయన ఆదేశాల మేరకు నిర్మాణాలను అడ్డుకునేందుకు వెళ్లగా.. ఆక్రమణదారులు అన్ని హక్కు పత్రాలు ఉన్నాయని.. ఏవేవో బూతులు మాట్లాడారు. ఈ విషయం కూడా సార్‌కు చెప్పాం. అయితే రిటర్న్‌గా ఫిర్యాదు రాసి ఇవ్వమని అధికారులు ఎవరూ అడగలేదు.
– స్మితమాధురి, హెచ్‌ఎం, ఎంపీపీఎస్ ఎర్రగుంట్ల


