శ్రీశైలం ప్రాజెక్ట్: సున్నిపెంటలో మద్యం దందా ఆగడం లేదు. గత రెండు రోజులుగా బ్లాక్‌లో మద్యం విక్రయాల జోరు సాగుతోంది. బుధవారం తూతూ మంత్రంగా ఎకై ్సజ్ పోలీసులు వైన్‌షాపు పరిసరాల్లో పెట్రోలింగ్ చేశారు కాని బ్లాక్‌లో మద్యం అమ్మే వ్యక్తులను పట్టుకోలేకపోయారు. ఉగాది పండుగ సందర్భంగా బుధ, గురువారాల్లో మద్యం దుకాణాలు మూసివేయాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి ఆదేశాలు జారీచేశారు. అయినప్పటికీ వైన్‌షాప్ పరిసర ప్రాంతాల్లోనే సుమారు 8 మంది వివిధ బ్రాండ్‌ల క్వార్టర్ బాటిళ్లపై రూ.50 నుంచి రూ.100 వరకు అదనంగా తీసుకొని విక్రయిస్తున్నారు. గురువారం కూడా వైన్‌షాపుల వద్ద బహిరంగంగానే బ్లాక్‌లో విక్రయాలు జోరుగా సాగాయి.


