కమిషనర్ ప్రసాద్ గౌడ్ రెండేళ్ల కాలం నుంచి మున్సిపల్ నిబంధనలను గాలికి వదిలేసి ఇష్టానుసారంగా ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారు. కమిషనర్ వ్యవహార శైలిపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకొని ప్రజాధనాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది. – దినేష్‌గౌడ్, కౌన్సిలర్, డోన్
డోన్ మున్సిపల్ చరిత్రలో కమిషనర్ ప్రసాద్‌గౌడ్ అత్యంత అవినీతి పరునిగా పేరుగాంచారు. అనేక మందిని ఉద్యోగాల పేరుతో మభ్యపెట్టి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. లంచాలు తీసుకొని బహుళ అంతస్తుల నిర్మాణాలను, అక్రమ దుకాణాల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నారు. దీనిపై సత్వర విచారణ జరగాల్సిందే.
– సుంకయ్య, సీపీఐ కౌన్సిలర్, డోన్
నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ డ్రైవర్‌ను ప్రైవేటు వాహనానికి వినియోగించుకుంటూ ప్రజాధనాన్ని కొల్లగొట్టిన విషయం మామూలు వ్యవహారం కాదు. కమిషనర్ నుంచి డ్రైవర్ వేతనాన్ని మొదటి నుంచి రికవరీ చేయాల్సిన బాధ్యత మున్సిపల్ ఉన్నతాధికారులపై ఉంది.
– బుర్రు రమాదేవి, కౌన్సిలర్, డోన్


