పాణ్యం: కొత్తూరు గ్రామంలో వెలసిన శ్రీవల్లి సుబ్రమణ్యేవ్వరస్వామి వారికి ఆదివారం భక్తులు రెండు వెండి పడిగెలు బహూకరించారని ఈఓ రామకృష్ణ తెలిపారు. నంద్యాల మండలం పెద్ద కొట్టాల గ్రామానికి చెందిన పట్నం వెంకటసుబ్బయ్య వారి కుటుంబ సభ్యులు 500 గ్రామలు నాగమ వెండి పడిగె, బండిఆత్మకూరు మండలం లింగాపురం గ్రామానికి చెందిన బానగిరి వెంకటసుబ్బయ్య వారు 485 గ్రాముల వెండి నాగపడిగెను విరాళంగా సమర్పించారన్నారు. వీటి విలువ సుమారు రూ. 3 లక్షల వరకు ఉంటుందని తెలిపారు.
నేడు కలెక్టరేట్‌లో
ప్రజా వినతుల స్వీకరణ
నంద్యాల: స్థానిక కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో ఈనెల 16వ తేదీ సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1100ను సంప్రదించవచ్చన్నారు. అలాగే అర్జీదారులు దరఖాస్తుల ప్రస్తుత సమాచారాన్ని meekosam. ap. gov. in వెబ్‌సైట్‌లో సంప్ర దించి తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను కూడా ఇలాగే నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీదారు లందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండ ల కేంద్రాల్లో, మున్సిపల్ కార్యాలయాల్లో, డివి జన్ స్థాయిలో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కా ర వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఉదయం 9.30 గంటలకు అధికారులందరూ తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు.
శ్రీశైలం చేరుకున్న
పుదుచ్చేరి సీఎం
శ్రీశైలంటెంపుల్: శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను దర్శించుకునేందుకు పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి ఆదివారం రాత్రి శ్రీశైలం చేరుకున్నారు. ఈయనకు భ్రమరాంబా అతిథిగృహం వద్ద దేవస్థాన ఈఓ, అధికారులు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. సోమవారం ఉదయం మల్లికార్జున స్వామివారిని, భ్రమరాంబాదేవిని పుదుచ్చేరి సీఎం దర్శించుకుంటారని దేవస్థాన అధికారులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో
వైద్యుడి మృతి
కర్నూలు: రోడ్డు ప్రమాదంలో డాక్టర్ వి.హరికుమార్(24) అక్కడికక్క డే మృతి చెందాడు. నందికొట్కూరు మండలం కొణిదెల గ్రామానికి చెందిన ఈయన తండ్రి జయరాముడుతో కలసి కర్నూలు కొత్తబస్టాండు సమీపంలోని ఏపీ ట్రాన్స్‌కో కార్యాలయం ఎదురుగా ఉన్న తిలక్‌నగర్‌లో నివాసం ఉంటు న్నారు. గాయత్రీ ఎస్టేటులోని ఆర్క్ ఆసుపత్రిలో డాక్టరుగా పని చేస్తున్నారు. వెల్దుర్తి గ్రామ శివారులోని తిక్క నరసింహస్వామిని దర్శించుకొని శనివారం అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో ద్విచక్ర వాహనంపై కర్నూలుకు చేరుకున్నారు. బళ్లారి చౌరస్తా వద్ద ఫ్లై ఓవర్ బ్రిడ్జి ఎక్కుతుండగా గుర్తు తెలియని వాహనం వెనుక వైపు నుంచి ఢీకొట్టింది. దీంతో తలఛిద్రమైంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకొని హరికుమార్‌ను ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని మార్చురీ కేంద్రానికి తరలించారు. ఆదివారం పోస్టుమార్టం నిర్వహించి అప్పగించారు.


