ఉగాది మహోత్సవాలకు వేళాయె! | - | Sakshi
Sakshi News home page

ఉగాది మహోత్సవాలకు వేళాయె!

Mar 16 2026 7:26 AM | Updated on Mar 16 2026 7:26 AM

ముస్తాబైన శ్రీగిరి క్షేత్రం

ఉత్సవాలకు నేడు అంకురార్పణ

ఐదు రోజుల పాటు జరుగనున్న మహోత్సవాలు

మొదటి రోజు మహాలక్ష్మీ అలంకారం, భృంగివాహనసేవ

విద్యుత్‌ దీపాలంకరణలో భ్రమరాంబ ఆలయం

శ్రీశైలంటెంపుల్‌: శ్రీశైలమహాక్షేత్రంలో ఐదు రోజుల పాటు వైభవంగా జరుగనున్న ఉగాది మహోత్సవాలకు శ్రీగిరి ముస్తాబైంది. సోమవారం ఉగాది మహోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ చేయ నున్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని కర్ణాటక, మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుండి అధికసంఖ్యలో భక్తులు శ్రీగిరి తరలివస్తున్నారు. దీంతో శ్రీశైలం కన్నడ భక్తులతో కిక్కిరిసిపోయింది. ఐదు రోజుల పాటు జరుగనున్న మహోత్సవాలకు దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఉగాది మహోత్సవాలు సోమ వారం ఉదయం 9 గంటలకు దేవస్థాన ఈఓ, ఉభ య దేవాలయాల ప్రధానార్చకు లు, స్థానాచార్యులు స్వామివారి యాగశాల ప్రవేశం చేసి ఉత్సవాలకు అంకురార్పణ చేస్తారు. ఐదు రోజుల పాటు నిర్వహించే ఉగాది మహోత్సవాల్లో భాగంగా ప్రతి రోజు భ్రమరాంబాదేవికి ప్రత్యేక అలంకారం, భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు విశేష వాహనసేవ నిర్వహిస్తారు. మహోత్సవాల్లో మొదటిరోజు సోమవారం భ్రమరాంబాదేవికి మహాలక్ష్మీ అలంకారం, భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు భృంగివాహనసేవ నిర్వహిస్తారు. ప్రత్యేకంగా అలంకీకృతులైన స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు గ్రామపురవీధుల్లో అంగరంగ వైభవంగా గ్రామోత్సవం నిర్వహిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement