రాష్ట్ర బీసీసెల్‌ ప్రధాన కార్యదర్శిగా మౌలాలి | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర బీసీసెల్‌ ప్రధాన కార్యదర్శిగా మౌలాలి

Mar 6 2026 8:09 AM | Updated on Mar 6 2026 8:09 AM

బొమ్మలసత్రం/పాములపాడు: వైఎస్సార్‌సీపీ రాష్ట్ర బీసీ విభాగం ప్రధాన కార్యదర్శిగా పాములపాడు మండలం ఇస్కాల గ్రామానికి చెందిన ఢంకా మౌలాలి(బంగారం)ను నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం పత్రిక ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.

పాలిసెట్‌కు దరఖాస్తుల ఆహ్వానం

నంద్యాల(న్యూటౌన్‌): పాలిటెక్నిక్‌ కళాశాల్లో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా పాలిటెక్నిక్‌ కో ఆర్డినేటర్‌ శైలేంద్రకుమార్‌ పేర్కొన్నారు. గురువారం స్థానిక పాలిటెక్నిక్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరు సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు ఉత్తీర్ణులైన తర్వాత ఏప్రిల్‌ 4వ తేదీలోపు https://polycetap.ap. gov.in వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ప్రవేశ పరీక్ష ఏప్రిల్‌ 25న ఉంటుందన్నారు. ఈ ఏడాది నంద్యాల, బేతంచెర్ల, బనగానపల్లె, నందికొట్కూరు, ఆత్మకూరు, ఆళ్లగడ్డ, డోన్‌లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మరింత సమాచారం కోసం 9912377723 నంబరును సంప్రదించాలన్నారు.

పకడ్బందీగా ‘ఓపెన్‌’ పరీక్షలు

నంద్యాల(న్యూటౌన్‌): ఓపెన్‌ ఇంటర్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఎంఈఓలను పరిశీలకురాలు అనురాధ ఆదేశించారు. ఓపెన్‌ ఇంటర్‌ పరీక్షల ప్రశ్నపత్రాల కేంద్రాన్ని గురువారం ఆమె పరిశీలించారు. అనంతరం ఎస్పీజీ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈమె వెంట డీఈఓ జనార్దన్‌రెడ్డి ఉన్నారు.

కేజీబీవీల్లో మిగిలిన సీట్ల భర్తీ

నంద్యాల(న్యూటౌన్‌): జిల్లాలోని 27 కేజీబీవీ(కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు)ల్లో మిగిలిన సీట్లను భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సమగ్ర శిక్ష జిల్లా అదనపు కో ఆర్డినేటర్‌ నిత్యానందరాజు, జీసీడీఓ సువర్చ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ ద్వారా ఈనెల 12 నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. 6వ తరగతికి 40 సీట్లు ఉన్నాయని, 7, 8, 9, 10, 12 తరగతులకు 2025–26 ఏడాదికి మిగిలిన సీట్లు ఆన్‌లైన్‌ ద్వారా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. కేజీబీవీ కళాశాలలో ఎంపీసీ గ్రూప్‌కు–14, బైపీసీకి 10, సీఈసీకి 1, ఎంఈసీకి 1, ఏఅండ్‌టీ 1లలో బాలికలకు విద్యను అభ్యసించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.

సామాజిక

బాధ్యత కలిగి ఉండాలి

కర్నూలు కల్చరల్‌: యువత చదువుతో పాటు సామాజిక బాధ్యత కలిగి ఉండాలని రాయలసీమ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ఆచార్య వి.వెంకటబసవరావు అన్నారు. యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగం ఆధ్వర్యంలో ఎన్‌ఎస్‌ఎస్‌ స్వచ్ఛతా యాక్షన్‌ ప్లాన్‌లో భాగంగా కర్నూలు ఆర్టీసీ బస్‌స్టేషన్‌ ప్రాంగణంలో చేపట్టిన ఒక రోజు పరిశుభ్రతా కార్యక్రమాన్ని గురువారం వీసీ వర్సిటీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ విశ్వ విద్యాలయం ఆర్ట్స్‌, సైన్స్‌, ఇంజనీరింగ్‌ కాలేజీల విద్యార్థులు బస్టాండ్‌ పరిసరాల్లో పరిశుభ్రతా కార్యక్రమాలు చేపట్టడం సంతోషకరమన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవలసిన అవసరాన్ని ప్రతి పౌరుడూ తెలుసుకోవాలని వర్సిటీ రెక్టార్‌ ఆచార్య ఎన్‌టీకే నాయక్‌, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ బి.విజయ్‌ కుమార్‌ నాయుడు అన్నారు. వర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్‌ సమన్వయకర్త డాక్టర్‌ పి.నాగరాజు, హైదరాబాదులోని ఎన్‌ఎస్‌ఎస్‌ డైరెక్టరేట్‌ ప్రతినిధి సంజయ్‌, కర్నూలు–1 డిపో మేనేజర్‌ కె.సుధారాణి, వర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రొగ్రాం ఆఫీసర్లు డాక్టర్‌ కె.వెఎంకటరత్నం, డాక్టర్‌ బి.విజయుడు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement