● వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి
భూమా కిషోర్‌రెడ్డి
ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే అఖిలప్రియ, ఆమె భర్త భార్గవరామ్‌ల అవినీతి, అరాచక పాలన సాగుతోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి భూమా కిషోర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ గూండాల చేతిలో కత్తిపోట్లకు గురై ఆళ్లగడ్డ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న వైఎస్సార్‌సీపీ నాయకుడు శివరామిరెడ్డిని కిషోర్‌రెడ్డి గురువారం పరామర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ రామ్ ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోయిందన్నారు. ఆస్తులు రాయించుకోవాలని శివరామిరెడ్డిని బెదిరించారన్నారు. డబ్బులు ఇవ్వలేదనే హతమార్చేందుకు యత్నించడం సిగ్గుచేటన్నారు. రౌడీలను, గూండాలను వెంటపెట్టుకుని ఇలాంటి అరాచకాలకు పాల్పడుతూ ఏం సాధించాలనుకుంటున్నారని ప్రశ్నించారు. దాడికి పాల్పడ్డవారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.


