కర్నూలు(అర్బన్): జిల్లాపరిషత్ పరిధిలోని వివిధ కా ర్యాలయాల్లో జూనియర్ సహాయకులు/టైపిస్టులుగా విధులు నిర్వహిస్తున్న నలుగురికి సీనియర్ సహాయకులుగా పదోన్నతి కల్పించినట్లు జిల్లాపరిషత్ సీఈఓ జి.నాసరరెడ్డి తెలిపారు. గురువారం స్థానిక కార్యాలయంలో పదోన్నతి పొందిన నలుగురు ఉద్యోగులకు జిల్లాపరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి పదోన్నతి ఉత్తర్వులను అందజేశారు. అలాగే పదోన్నతి పొందిన వారికి వివిధ మండల పరిషత్ కార్యాలయాలకు పోస్టింగ్స్ ఇచ్చారు. పదోన్నతి పొందిన వారిలో డి.ప్రభాకర్‌ను గోనెగండ్ల, ఐ.లక్ష్మీబాయిని దొర్నిపా డు, జె.చిన్నయ్యను బనగానపల్లె, వి.లలితా జ్యోతిని పాములపాడుకు పోస్టింగ్స్ ఇచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఈఓ ఇ.వి.సుబ్బారెడ్డి పాల్గొన్నారు.


