పోర్ట్‌ఫోలియో జడ్జిని కలసిన న్యాయవాదులు | - | Sakshi
Sakshi News home page

పోర్ట్‌ఫోలియో జడ్జిని కలసిన న్యాయవాదులు

Jan 24 2026 8:48 AM | Updated on Jan 24 2026 8:48 AM

పోర్ట్‌ఫోలియో జడ్జిని కలసిన న్యాయవాదులు

పోర్ట్‌ఫోలియో జడ్జిని కలసిన న్యాయవాదులు

కర్నూలు: కర్నూలులో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన పోర్ట్‌పోలియో జడ్జి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌ను శుక్రవారం సాయంత్రం జిల్లా న్యాయవాద సంఘం కార్యవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హరినాథ్‌ చౌదరి, వెంకటేశ్వర్లు ఆయన్ను శాలువాతో సత్కరించి పుష్కగుచ్ఛం అందించారు. జిల్లాలోని న్యాయ స్థానాల్లో కావలసిన సదుపాయాలు, పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి స్పెషల్‌ కోర్టుల ఏర్పాటు తదితర అంశాలపై పోర్ట్‌ఫోలియో జడ్జికి వినతిపత్రం సమర్పించారు. సీనియర్‌ న్యాయవాదులు ఎండీవీ జోగయ్య శర్మ, జాయింట్‌ సెక్రటరీ బాలసుబ్రహ్మణ్యం, మహిళా న్యాయవాది దీపిక తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement