ధరలపై యుద్ధ ప్రభావం
శిరివెళ్ల: హిందూ ముస్లింలకు అతి పెద్ద పండుగలు ఉగాది, రంజాన్. సరిగ్గా పండుగల వేళ గ్యాస్‌పై ప్రజల్లో ఆందోళన నెలకొంది. బుక్ చేసిన రెండు, మూడు రోజులకు కానీ గ్యాస్ సిలిండర్ దొరకని పరిస్థితి. మండల కేంద్రంలో ఏ ఇంటి ముందు చూసినా ఖాళీ గ్యాస్ సిలిండర్లే దర్శనమిస్తున్నాయి. బండి రాగానే ఆత్రుతతో సిలిండర్ కోసం ప్రజలు ఎగబడుతున్నారు. ఇదిలా ఉంటే చిన్న చిన్న హోటళ్ల నిర్వాహకుల పరిస్థితి మరి ఘోరంగా ఉంది. మొన్నటి వరకు దోసె రూ.30 ఉండగా.. నేడు రూ. 40లకు విక్రయిస్తున్నారు.
ఫొటోలు : వడ్డె శ్రీనివాసులు
మేము గాయత్రీ ఎస్టేట్‌లో 2023 నుంచి ఫిష్ ఆంధ్ర రెస్టారెంట్ నడుపుతున్నాం. రూ.1000లకు లభించే గ్యాస్ బండ ఇప్పుడు రూ.2వేలు పెట్టినా దొరకడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే ఒకటి రెండు రోజుల్లో హోటల్ మూసేద్దామనుకుంటున్నా. మా హోటల్‌పై పలువురు ఉపాధి పొందుతున్నారు. వీరందరూ ఉపాధి కోల్పోతారు.
– రంగ ఫిష్ ఆంధ్ర రెస్టారెంట్
నిర్వాహకుడు, కర్నూలు
గ్యాస్ సిలిండర్ దొరకడం లేదు. విధిలేని పరిస్థితుల్లో బ్లాక్‌లో కొనాల్సి వస్తోంది. వంట నూనెల ధర కూడా మండుతోంది. యుద్ధానికి ముందు సన్‌ఫ్లవర్ ఆయిల్ లీటరు ప్యాకెట్ రూ.162 ఉండగా నేడు రూ.185లకు చేరింది. ప్రభుత్వం చొరవ తీసుకొని గ్యాస్ కొరత లేకుండా చర్యలు చేపట్టాలి. వంట నూనెల కృత్రిమ కొరతను అడ్డుకోవాలి.
– అరుణ, నంద్యాల చెక్‌పోస్టు ఏరియా, కర్నూలు
కొత్త బస్టాండ్ సమీపంలోని ఓ హోటల్‌లో కట్టెల పొయ్యిపై వంటలు చేస్తున్న దృశ్యం
ఏజెన్సీ
నుంచి గ్యాస్
సిలిండర్ తీసుకెళ్తున్న
యువకుడు
ఉక్కిరిబిక్కిరి చేస్తున్న
వంట గ్యాస్ కొరత
బ్లాక్ మార్కెట్‌లో
అధిక ధరకు విక్రయం
అంతకంతకూ పెరుగుతున్న
వంటనూనె ధర
అడ్డగోలు ధరలపై నియంత్రణ కరువు
పండుగలు, శుభకార్యాల వేళ అవస్థలు


