యువకుడి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

యువకుడి ఆత్మహత్య

Jan 24 2026 8:48 AM | Updated on Jan 24 2026 8:48 AM

యువకు

యువకుడి ఆత్మహత్య

బొమ్మలసత్రం: నంద్యాల మండలం ఊడుమాల్పురం గ్రామానికి చెందిన సురేంద్రరెడ్డి (23) శుక్రవారం రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఊడుమాల్పురం గ్రామానికి చెందిన సురేంద్రరెడ్డి పట్టణంలో ర్యాపిడో బైక్‌ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. సురేంద్రరెడ్డికి ఇద్దరు సోదరులు, తల్లిదండ్రులు ఉన్నారు. ఉదయం పని నిమిత్తం పట్టణానికి వచ్చిన సురేంద్రరెడ్డి నూనెపల్లి సమీపంలోని రైల్వే ట్రాక్‌ వద్దకు వచ్చి గుర్తుతెలియని రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ నుంచి కుటుంబ సభ్యులకు ఫోన్‌చేసి సమాచారం అందించారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉందని, మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.

శ్రీశైలం నుంచి 11,676 క్యూసెక్కుల తరలింపు

శ్రీశైలం ప్రాజెక్ట్‌: శ్రీశైలం జలాశయం నుంచి దిగువ ప్రాజెక్ట్‌లకు గురువారం నుంచి శుక్రవారం వరకు 11,676 క్యూసెక్కుల నీటిని తరలించారు. ఎడమగట్టు జలవిద్యుత్‌ కేంద్రంలో 2.490 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి నాగార్జునసాగర్‌కు 4,933 క్యూసెక్కుల నీటిని వదిలారు. బ్యాక్‌ వాటర్‌ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ ద్వారా 2వేల క్యూసెక్కులు, హంద్రీనీవా సుజలస్రవంతికి 2,343 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 2,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

కర్నూలు: కర్నూలు శివారులోని 44వ జాతీయ రహదారి పక్కన శరీన్‌ నగర్‌ వైపు నుంచి వచ్చే సర్వీసు రోడ్డులో రెండు బైకులు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరు తీవ్ర గాయాలకు గురై ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం కొత్తపేట గ్రామానికి చెందిన షేక్‌ హుసేన్‌ బాషా (41) శరీన్‌ నగర్‌లో నివాసముంటూ అదే కాలనీలోని వైఎస్సార్‌ విగ్రహం వద్ద గోబీ బండి నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం స్నేహితుడు అబ్దుల్లాతో కలసి పల్సర్‌ వాహనంపై సూర్య దేవాలయం వైపు నుంచి గుత్తి పెట్రోల్‌ బంకులో పెట్రోల్‌ పోయించుకునేందుకు వెళ్తుండగా హోండా యాక్టివాలో మరో వ్యక్తి వేగంగా వచ్చి పల్సర్‌ను ఢీకొట్టింది. దీంతో షేక్‌ హుసేన్‌ బాషాకు నుదుటిపై బలమైన గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు పోలీస్‌ హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 112కు ఫోన్‌ చేసి సమాచారమివ్వగా ట్రాఫిక్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. గాయాలకు గురైన అబ్దుల్లాను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించి వైద్యచికిత్సలు చేయించారు. మృతదేహాన్ని ప్రైవేటు వాహనంలో ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీ కేంద్రానికి తరలించారు. గాయాలకు గురైన అబ్దుల్లా గౌండా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. మృతుని భార్య పర్వీన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ట్రాఫిక్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గుర్తు తెలియని వృద్ధురాలి మృతి

మద్దికెర: స్థానిక బస్టాండు షెల్టర్‌లో గుర్తు తెలియని వృద్ధురాలు శుక్రవారం మృతి చెందినట్లు మద్దికెర ఎస్‌ఐ హరిత తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు దాదాపు 80 ఏళ్ల వృద్ధురాలు గత కొంతకాలంగా గ్రామంలో యాచిస్తూ కడుపునింపుకునేందన్నారు. వృద్ధురాలికి తెలుగు బాష రాదని, కన్నడ మాత్రమే వస్తుందన్నారు. ఎవరైనా అడిగితే తనది హోస్పేట్‌ అని చెబుతుండేదన్నారు. ఆమె గురించి సమాచారం తెలిసిన వారు మద్దికెర ఎస్‌ఐ 9121101130కు ఫోన్‌ చేయాలన్నారు.

కూలీల ఆటో బోల్తా

వృద్ధురాలి మృతి

పాణ్యం: వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి బయలుదేరిన కూలీలు రోడ్డు ప్రమాదానికి గురయ్యా రు. వారిలో ఓ వృద్ధురాలు తీవ్రంగా గాయపడి మృతి చెందగా.. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. బాధితులు తెలిపిన వివరాలకు.. పాణ్యంకు గ్రామానికి చెందిన 12 కూలీలు వ్యవసాయ పనుల నిమిత్తం బలపనూరు సమీపంలో పొలూరు పొలాల్లోకి వెళ్లారు. పనులు ముగించుకుని తిగిరి వసున్న సమయంలో జీఎం కళాశాల వద్ద జాతీయ రహదారిపై ప్రమాదశాత్తు బోల్తా పడింది. ఈ ఘటనలో ఏడుగురికి గాయాలు కావడంతో సమీపంలో శాంతిరామ్‌ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలపాలైన పాణ్యంకు చెందిన గుడిపాటి పెద్దక్క(61) కోలుకోలేక మృతి చెందింది. రాములమ్మ, రాజేశ్వరి, జ్యోతి, మధారా, షష్మీ, దస్తగిరమ్మతో పాటు మరొకరు చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న హైవే పెట్రోల్‌ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదంపై ఆరా తీశారు. ప్రమాదానికి కారణమైన ఆటోను స్టేషన్‌కు తరలించారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

యువకుడి ఆత్మహత్య 1
1/2

యువకుడి ఆత్మహత్య

యువకుడి ఆత్మహత్య 2
2/2

యువకుడి ఆత్మహత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement