బ్యాంకుల సమ్మెకు సీఐటీయూ మద్దతు
కర్నూలు(సెంట్రల్): దేశవ్యాప్తంగా జనవరి 27న జరిగే బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు సీఐటీయూ సంపూర్ణ మద్దతు ఇవ్వనున్నట్లు ఆ సంఘం జిల్లా కార్యదర్శి ఎండీ అంజిబాబు తెలి పారు. శుక్రవారం బ్యాంకు ఉద్యోగులకు సంఘీభావంగా సీఐటీయూ నాయకులు కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. వారానికి ఐదు రోజులు మాత్రమే పని దినాలు ఉండాలన్న ఉద్యోగుల న్యాయమైన కోరికకు ప్రభుత్వం ఆమోదం తెలపాలన్నారు. ఉద్యోగులపై పనిభారం తగ్గించడానికి ఇదే సరైన మార్గమన్నారు.
మామిడి పంట రక్షణపై అవగాహన అవసరం
● తిరుపతి ప్రాంతీయ ఉద్యాన పరిశోధన
స్థానం సీనియర్ శాస్త్రవేత్త శ్రీనివాసరెడ్డి
కర్నూలు(అగ్రికల్చర్): ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో మామిడిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతు లు అవగాహన పెంచుకోవాలని తిరుపతి ప్రాంతీయ ఉద్యాన పరిశోధన సంస్థ సీనియర్ ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. శుక్రవారం కర్నూలులోని ఉద్యానభవన్‌తో వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్న దృష్టా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో డాక్టర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. మామిడి కాయలు నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడు కవర్లు తొడగడంతో నాణ్యత పెంపొందుతుందని తెలిపారు. కవర్లు తొడగకపోతే చీడపీడల ప్రభావం వల్ల కాయల్లో నాణ్యత దెబ్బతింటుందని, కాయల్లో నాణ్యతను పెంచుకునేందుకు ఫ్రూట్స్ కవర్లు వినియోగించాలని సూచించారు. నీరు, ఎరువుల యాజమాన్యంపై రైతులు మరింత అవగాహన పెంచుకోవాలనే దానిపై అవగాహన కల్పించారు. జిల్లా ఉద్యాన అధికారి రాజాకృష్ణారెడ్డి మాట్లాడుతూ... తేనేమంచు పురుగు, గొంగలి, కాండం తొలుచు, తామర పురుగులు, పండు ఈగ తదితర వాటివల్ల మామిడికి నష్టం కలుగుతుందని, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. ప్రారంభంలో చీడపీడలను గుర్తిస్తే నివారణ సులభం అవుతుందని పేర్కొన్నారు. కాగా పలువురు ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో మామిడిలో పూత పిందె రాలిపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతర అనుమానాలపై రైతులు తమ అనుమానాలను నివృత్తి చేసుకున్నారు. కార్యక్రమంలో ఉద్యాన అధికారులు నరేష్‌కుమార్‌రెడ్డి, మదన్‌మోహన్ గౌడు తదితరులు పాల్గొన్నారు.
జగన్ పాదయాత్ర చేస్తానంటే ఎందుకంత గుబులు?
కర్నూలు (టౌన్): రాష్ట్రంలో పాదయాత్ర చేస్తానని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రకటిస్తే కూటమి నేతల్లో ఎందుకంత గుబులు అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి మద్దూరు సుభాష్ చంద్రబోస్ ప్రశ్నించారు. శుక్రవారం స్థానిక సి.క్యాంపులోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతుందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నేరవేర్చడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా వైఫలమైందని విమర్శించారు. ప్రజలకు లేని పోని ఆశలు కల్పించి సూపర్ సిక్స్ అంటూ ఇంట్లో ఎంత మంది ఉంటే అందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తామని చంద్రబాబు అన్ని వర్గాలను మోసం చేశారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన రెండేళ్లలోపే ప్రజలు జగనన్న సంక్షేమ పాలనను గుర్తు చేసుకుంటున్నారన్నారు. జగనన్న పాదయాత్ర కోసం రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. కుల, మత రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాలకు జగనన్న హయంలో న్యాయం జరిగిందన్నారు. కూటమికి ఓటమి భయం పట్టుకుందన్నారు. రెండవ సారి పాదయాత్రతో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చరిత్ర సృష్టిస్తారన్నారు.


