నామినేషన్ల స్వీకరణ వాయిదా | - | Sakshi
Sakshi News home page

నామినేషన్ల స్వీకరణ వాయిదా

Jan 24 2026 8:48 AM | Updated on Jan 24 2026 8:48 AM

నామిన

నామినేషన్ల స్వీకరణ వాయిదా

● శాంతిభద్రతల సమస్య చూపిన పోలీసులు

నంద్యాల(అర్బన్‌): విజయ డెయిరీలో ముగ్గురు డైరెక్టర్ల ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ శుక్రవారం వాయిదా పడింది. శాంతినగరం సొసైటీ అధ్యక్షురాలు ప్రమీలరాణి, గంగవరం సొసైటీ అధ్యక్షురాలు ఉడతా చంద్రకళ, మునగాల సొసైటీ అధ్యక్షుడు నాగేశ్వరరెడ్డి, గోరుకల్లు సొసైటీ నుంచి లక్ష్మిదేవిలు నామినేషన్లను దాఖలు చేసేందుకు వచ్చారు. దాదాపు 100 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. అయినా పోలీసులు శాంతి భద్రతల సమస్యలు అంటూ నామినేషన్లను వాయిదా వేయాలని డెయిరీ ఎండీని కోరడంపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నామినేషన్లు వేయించుకోకపోతే కోర్టుకు వెళ్లి న్యాయం కోసం పోరాడుతామన్నారు. శాంతిభద్రల కారణంగా నామినేషన్ల ప్రక్రియ నిలిపి వేయాలని పోలీసులు కోరడంతోనే వాయిదా వేశామని డెయిరీ ఎండీ ప్రదీప్‌కుమార్‌ తెలిపారు. మ్యాక్స్‌ చట్టం ప్రకారం న్యాయ నిపుణులతో చర్చించి వచ్చే నెలలో నామినేషన్ల ఏర్పాట్లను పూర్తి చేస్తామని చెప్పారు.

నామినేషన్ల స్వీకరణ వాయిదా1
1/1

నామినేషన్ల స్వీకరణ వాయిదా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement