మధ్యవర్తిత్వంతో కేసుల పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

మధ్యవర్తిత్వంతో కేసుల పరిష్కారం

Jan 24 2026 8:48 AM | Updated on Jan 24 2026 8:48 AM

మధ్యవర్తిత్వంతో కేసుల పరిష్కారం

మధ్యవర్తిత్వంతో కేసుల పరిష్కారం

కర్నూలు: వివాదాల పరిష్కారానికి ప్రత్యామ్నాయ మార్గంగా సివిల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లోని సెక్షన్‌ 89 కింద పరిగణించేదే మధ్యవర్తిత్వమని, దానివల్ల కోర్టులో కేసులు విచారణకు వెళ్లకుండానే పరిష్కరించుకోవచ్చని న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి అన్నారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ కార్యాలయ భవనంలో ఉమ్మడి జిల్లాల న్యా యవాదులకు మధ్యవర్తిత్వంపై 40 గంటల శిక్షణ కార్యక్రమం జరిగింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒకటవ అదనపు జిల్లా జడ్జి కమ లాదేవి, శాశ్వత లోక్‌ అదాలత్‌ చైర్మన్‌ వెంకటహ రినాథ్‌, లీలా వెంకటశేషాద్రి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మధ్యవర్తిత్వం ఎలా నిర్వహించాలనే దానిపై కర్నూలు, నంద్యాల జిల్లాల న్యాయవాదులకు ఈనెల 19 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. చైన్నె నుంచి వచ్చిన మధ్యవర్తిత్వ శిక్షణ సిబ్బంది శశిదేవి, రత్నతార తదితరులు న్యాయ మధ్యవర్తిత్వంపై న్యాయవాదులకు శిక్షణ ఇచ్చారు. ఉమ్మడి జిల్లా న్యాయవాదులతో పాటు సామాజిక కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement