సాగునీటి ప్రాజెక్టులకు ‘చంద్ర’గ్రహణం
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి
బనగానపల్లె: రాయలసీమలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ‘చంద్ర’గ్రహణం పట్టిందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరి సీమ ఎత్తిపోతల పథకాలకు మరణశాసనం అయ్యిందని ఆరోపించారు. బనగానపల్లె పట్టణంలోని సీఎంఆర్ ఫంక్షన్‌హాల్‌లో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అధ్యక్షతన నియోజకవర్గస్థాయి వైఎస్సార్‌సీపీ సంస్థాగత నిర్మాణ సమావేశం జరిగింది. ముఖ్య అతిథులుగా జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, జిల్లా వైఎస్సార్‌సీపీ పరిశీలకులు ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు భూమా కిశోర్‌రెడ్డి, రాష్ట్ర స్థాయి నాయకులు చల్లా విఘ్నేశ్వరరెడ్డి, గుండం సూర్యప్రకాష్‌రెడ్డి, డాక్టర్ బీవీ వెంకటరమణ, లీగల్ సెల్ న్యాయవాది అబ్దుల్‌ఖైర్, గుండం నాగేశ్వరరెడ్డి, అత్తార్‌జాహెద్ అనిల్, అంబటి రవికుమార్‌రెడ్డి హాజరయ్యారు.
త్వరలో పోతిరెడ్డిపాడు వద్ద రైతుల సమావేశం
జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు కాటసాని రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. ఏపీ హక్కులను తెలంగాణాకు సీఎం చంద్రబాబు తాకట్టుపెట్టారని, ఈ విషయంపై రైతులు ఆగ్రహంతో ఉన్నారన్నారు. తన మీద గౌరవంతోనే రాయలసీమ ఎత్తిపోతల పనులు చంద్రబాబు ఆపివేసినట్లు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగాప్రకటించారన్నారు. విద్యుత్ పేరుతో శ్రీశైలం ప్రాజెక్టును తెలంగాణ ఖాళీ చేస్తున్నా టీడీపీ నేతలు నోరుమెదపడంలేదన్నారు. ఈ సమస్యలపై త్వరలో పోతిరెడ్డిపాడు వద్ద రైతులతో సమావేశం నిర్వహిస్తామన్నారు. పెద్ద ఎత్తున రైతులు హాజరుకావాలని కోరారు.
సీమకు అన్ని విధాలుగా అన్యాయం
జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వంలో రాయలసీమకు అన్ని విధాలు గా అన్యాయం జరుగుతోందనప్నారు. ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మాట్లాడుతూ.. గ్రామస్థాయి నుంచి వైఎస్సా ర్‌సీపీ బలోపేతం కావాలన్నారు. ప్రతి కార్యకర్తకు ఐడీ కార్డు ఇస్తామన్నారు. నియోజకవర్గ పరిశీలకులు భూ మా కిశోర్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ అరాచకాలను ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించాలన్నారు.
ఐదు అంచల విధానంలో కమిటీల ఏర్పాటు
ఐదు అంచల విధానంలో వైఎస్సార్‌సీపీ కమిటీలను ఏ ర్పాటు చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పేర్కొన్నారు. కలసికట్టుగా పార్టీని బలోపే తం చేయాలన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వ చ్చిన తరువాత పార్టీ నాయకులు, కార్యకర్తలకే పూర్తి హక్కులుంటాయన్నారు. బనగానపల్లె నియోజకవర్గంలో త్వరలో కమిటీల నియామకం పూర్తి చేస్తామన్నారు.
రాష్ట్రంలో ఇసుక, మట్టి మాఫియా
తమ ప్రభుత్వం భూములను రీ సర్వే చేస్తే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు విష ప్రచారం చేశారని కాటసాని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక మళ్లీ భూములును రీసర్వే చేస్తూ అసత్యప్రచారం చేస్తున్నారన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఇసుక, మట్టి మాఫియా చెలరేగుతున్నా చంద్రబాబు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో చికెన్ విక్రయదారుల నుంచి టీడీపీ నేతలు డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే వలంటీర్లు ఉండబోరని, పార్టీ నాయకులు, కార్యకర్తలకు అధిక ప్రాధాన్యత ఉంటుందన్నారు. వైఎస్సార్‌సీపీ బలోపేతానికి కమిటీల నియామకం అవసరమన్నారు.
సాగునీటి ప్రాజెక్టులకు ‘చంద్ర’గ్రహణం


