శ్రీశైలాలయానికి బంగారు తాళిబొట్లు | - | Sakshi
Sakshi News home page

శ్రీశైలాలయానికి బంగారు తాళిబొట్లు

Jan 24 2026 8:01 AM | Updated on Jan 24 2026 8:01 AM

శ్రీశ

శ్రీశైలాలయానికి బంగారు తాళిబొట్లు

శ్రీశైలం టెంపుల్‌: శ్రీశైలం దేవస్థానానికి శుక్రవారం కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చెందిన చెన్నుపాటి తిరుపతిరావు 78గ్రాములతో తయారు చేయించిన బంగారు తాళిబొట్లను సమర్పించారు. ఆలయ ప్రాంగాణంలోని ఆశీర్వచన మండపంలో దాతలు బంగారు తాళిబొట్లను పర్యవేక్షకులు జి.రవికుమార్‌, సిబ్బందికి అందజేశారు. విరాళాన్ని అందించిన దాతకు దేవస్థానం తరపున రసీదు, వేదాశీర్వచనంతో స్వామి అమ్మవార్ల శేషవస్త్రాలను, ప్రసాదాలను అందించి సత్కరించారు.

25న జాతీయ ఓటర్ల దినోత్సవం

నంద్యాల: భారత ఎన్నికల సంఘం స్థాపన దినోత్సవాన్ని పురస్కరించుకొని 2011 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ రాజకుమారి తెలిపారు. కలెక్టరేట్‌లోని వివిధ శాఖల సిబ్బందితో శుక్రవారం ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. అధికారులు స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల నిర్వహణకు కట్టుబడి ఉండాలన్నారు. ఓటర్ల జాబితా స్వచ్ఛీకరణ, చేర్పులు–తొలగింపులు, మార్పులు, తప్పుల్లేని ఓటరు జాబితా తయారీ, పోలింగ్‌ శాతం పెంపునకు చర్యలు తీసుకోవాలన్నారు.

జిల్లా నాయకులకు రాష్ట్ర కమిటీలో చోటు

బొమ్మలసత్రం: జిల్లాకు చెందిన ఆరుగురు వైఎస్సార్‌సీపీ నాయకులకు పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగాల్లో చోటు కల్పిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పాణ్యం నియోజకవర్గానికి చెందిన కాటసాని శివనరసింహారెడ్డికి స్టేట్‌ యూత్‌ వింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా, వైజా అరుణ రెడ్డికి రాష్ట్ర మహిళా విభాగ సెక్రటరీగా స్థానం కల్పించారు. అదే విధంగా నంద్యాల నియోజకవర్గానికి చెందిన పెద్ది శ్రీనివాసులుకు స్టేట్‌ లీగల్‌ సెల్‌ జనరల్‌ సెక్రటరీగా, ఆవుల తిమ్మారెడ్డికి స్టేట్‌ లీగల్‌ సెల్‌ అఫీషీయిల్‌ స్పోక్స్‌ పర్సన్‌గా స్థానం కల్పించారు. బనగానపల్లె నియోజకవర్గానికి చెందిన దండు మధుబాబుకు రాష్ట్ర ఎస్సీసెల్‌ సెక్రటరీగా, టి.వాయునందగౌడ్‌కు స్టేట్‌ బీసీసెల్‌ జాయింట్‌ సెక్రటరీగా నియమించారు.

శ్రీశైలాలయానికి బంగారు తాళిబొట్లు  1
1/1

శ్రీశైలాలయానికి బంగారు తాళిబొట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement