రాయలసీమ లిఫ్ట్‌తో ఎంతో మేలు | - | Sakshi
Sakshi News home page

రాయలసీమ లిఫ్ట్‌తో ఎంతో మేలు

Jan 23 2026 7:00 AM | Updated on Jan 23 2026 7:00 AM

రాయలస

రాయలసీమ లిఫ్ట్‌తో ఎంతో మేలు

సీఎం చంద్రబాబుకు

రైతులు బుద్ధి చెప్పాలి

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు

కాటసాని రాంభూపాల్‌ రెడ్డి

నందికొట్కూరు: రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌ రెడ్డి అన్నారు. రాయలసీమలో ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డితో కుమ్మకై రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టును నిలిపేయించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు రైతులు గుణపాఠం చెప్పాలన్నారు. నందికొట్కూరు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి పార్టీ సంస్థాగత నిర్మాణ సమావేశం గురవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ.. గ్రామస్థాయి నుంచే వైఎస్సార్‌సీపీని పటిష్టం చేయాలన్నారు. పార్టీ కోసం పని చేసే ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుందన్నారు.

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

తండ్రి బాటలోనే జగనన్న రైతులకు అన్ని సంక్షేమ పథకాలు అందుబాటులోకి తెచ్చారని కాటసాని అన్నారు. రైతు భరోసా కేంద్రాలతో గ్రామంలోనే రైతులకు అన్ని రకాల ఎరువులు అందించారన్నారు. జగనన్న అందించిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి అండగా ఉంటామన్నారు.

● ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ గ్రామస్థాయి కమిటీలను త్వరగా ఏర్పాటు చేయాలన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో అనుబంధ విభాగాల కమిటీల నిర్మాణం పూర్తి చేయాలన్నారు.

● వైఎస్సార్‌సీపీ నందికొట్కూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ దార సుధీర్‌ మాట్లాడుతూ.. పక్కనే కృష్ణానది ఉన్నా సాగు, తాగునీరు లేక ప్రజలు అల్లాడిపోతున్నారన్నారు. ప్రజల సమస్యలు పట్టించుకోకుండా టీడీపీ నేతలు రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారన్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై అన్యాయంగా అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు.

● కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ పరిశీలకులు బుడ్డా శేషారెడ్డి, రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామచంద్రారెడ్డి, ముస్లిం మైనార్టీ రాష్ట్ర సెల్‌ కార్యదర్శి జబ్బార్‌, విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాధురి, రాష్ట్ర ట్రేడ్‌ యూనియన్‌ కార్యదర్శి మోమిన్‌ మన్సూర్‌, జెడ్పీటీసీ సభ్యుడు సోమల సుధాకర్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు హరిసర్వోత్తమరెడ్డి, నబీరసూల్‌, సర్పంచ్‌లు జనార్దన్‌ గౌడ్‌, నాగార్జునరెడ్డి, భాస్కర్‌, వెంకటేశ్వర్లు, నాయకులు యాట ఓబులేసు, కోకిల రమణారెడ్డి, నాగశేనారెడ్డి, కృష్ణారెడ్డి, పుల్యాల నాగిరెడ్డి, రమేష్‌ నాయుడు, శివరామకృస్ణారెడ్డి, తిరుమలేష్‌రెడ్డి, సులోచనమ్మ, సుధాకర్‌రెడ్డి, అశోక్‌రెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డి, మన్సూర్‌ పాల్గొన్నారు.

రాయలసీమ లిఫ్ట్‌తో ఎంతో మేలు1
1/1

రాయలసీమ లిఫ్ట్‌తో ఎంతో మేలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement