ఇటీవల జరిగిన ప్రమాదాలు ఇవీ.. | - | Sakshi
Sakshi News home page

ఇటీవల జరిగిన ప్రమాదాలు ఇవీ..

Jan 23 2026 7:00 AM | Updated on Jan 23 2026 7:00 AM

ఇటీవల

ఇటీవల జరిగిన ప్రమాదాలు ఇవీ..

● గతేడాది జూలైలో ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు కరెంట్‌ స్తంభాన్ని ఢీకొని పొలాల్లోకి దూసుకెళ్లింది. శిరివెళ్ల మండల పరిధిలోని యర్రగుంట్ల వద్ద ఉన్న ఉషోదయ ప్రైవేటు పాఠశాల వద్ద తెల్లవారు జామున చోటుచేటు చేసుకుంది. ఆ సమయంలో బస్సులో 50 మంది యాత్రికులు ఉన్నారు. కరెంట్‌ వైర్లు బస్సుపై పడకపోవడంతో పెనుప్రమాదం తప్పింది.

● గతేడాది ఆగస్టులో ఆళ్లగడ్డ సమీపంలోని ఆల్ఫా ఇంజినీరింగ్‌ కాలేజీ వద్ద రెండు ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.

● ఆళ్లగడ్డ మండలం పేరాయిపల్లె గ్రామం మెట్ట సమీపంలో నవంబర్‌ 22న రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుంచి పుదుచ్చేరి వెళ్తున్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సును వెనక నుంచి లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.

● డిసెంబర్‌ 12న రాత్రి 11 గంటల సమయంలో ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు స్కూటర్‌ను ఢీకొంది. ప్రమాదంలో స్కూటర్‌పై వెళుతున్న ఇద్దరు మృతి చెందారు.

ఇటీవల జరిగిన ప్రమాదాలు ఇవీ..1
1/2

ఇటీవల జరిగిన ప్రమాదాలు ఇవీ..

ఇటీవల జరిగిన ప్రమాదాలు ఇవీ..2
2/2

ఇటీవల జరిగిన ప్రమాదాలు ఇవీ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement