వైభవంగా సుజయీంద్రుల ఆరాధన
మంత్రాలయం: నవ మంత్రాలయం నిర్మాత శ్రీ మఠం పూర్వ పీఠాధిపతి సుజయీంద్ర తీర్థుల ఆరాధన వేడుకలు గురువారం వైభవంగా నిర్వహించారు. శ్రీ మఠంలో సుజయీంద్రుల మూలబృందావనానికి మహా పంచామృతాభిషేకం చేశారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య పూజోత్సవాలు నిర్వహించారు. బంగారు రథంపై సుజయీంద్రుల చిత్రపటానికి శ్రీ మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు మంగళహారతులు చేశారు. అనంతరం బంగారు రథంపై చిత్రపటాన్ని అధిష్టింపజేసి శ్రీమఠం ప్రాంగణంలో భక్తుల మధ్య ఉత్సవం నిర్వహించారు. వేడుకల్లో గురుసార్వభౌమ భజన మండలి సభ్యుల కీర్తనలు అలరించాయి.
వైభవంగా సుజయీంద్రుల ఆరాధన


