ఎకై ్సజ్ ఉద్యోగులకు ఆటవిడుపు
● అట్టహాసంగా ప్రారంభమైన
ఎకై ్సజ్ స్పోర్ట్స్ మీట్
● మూడు రోజుల పాటు
కొనసాగనున్న క్రీడలు
కర్నూలు: ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఉద్యోగుల స్పోర్ట్స్ మీట్ కర్నూలు స్పోర్ట్స్ అథారిటీ ఔట్‌డోర్ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమైంది. మూడు రోజుల పాటు కొనసాగనున్న ఈ క్రీడాపోటీలను అసిస్టెంట్ కమిషనర్ హనుమంతరావు, కర్నూలు డీపీఈఓ సుధీర్ బాబుతో కలసి ఎకై ్సజ్ నోడల్ డిప్యూటీ కమిషనర్ పి.శ్రీదేవి గురువారం ప్రారంభించారు. జాతీయ రంగుల బెలూన్లను గాలిలోకి ఎగురవేయడం ద్వారా ఎకై ్సజ్ ఉద్యోగుల హర్షధ్వానాల మధ్య మైదానంలో క్రీడలు లాంఛనంగా ప్రారంభించారు. మహిళలు, పురుషులకు వేర్వేరుగా వంద మీటర్ల పరుగుపందెం పోటీలు, షాట్‌పుట్, టెన్నికాయిట్ పోటీలను నిర్వహించారు. అనంతరం క్రికెట్ పోటీలు మూడు మ్యాచ్‌లు నిర్వహించారు. ఆయా జట్లకు సీఐలు కెప్టెన్లుగా వ్యవహరించారు. ఏఈఎస్‌లు రాజశేఖర్ గౌడ్, రామకృష్ణా రెడ్డి, ఉమ్మడి జిల్లాల సీఐలు, ఎస్‌ఐలు, క్షేత్రస్థాయి సిబ్బంది, మినిస్టీరియల్ సిబ్బంది పాల్గొన్నారు.
పరుగుపందెంలో విజేతలు
● పురుషులకు నిర్వహించిన 100 మీటర్ల పరుగుపందెంలో పీసీలు బషీర్ బాషా, విజయ్‌కుమార్, విరుపాక్షి రెడ్డి, షాట్‌పుట్‌లో పీసీలు వెంకటేష్ నాయక్, సుభాన్, విరుపాక్షి రెడ్డిలు ప్రథమ, ద్వితియ, తృతీయ స్థానాలు సాధించారు.
● మహిళలకు నిర్వహించిన 100 మీటర్ల పరుగుపందెంలో పీసీలు శ్వేతా రాణి, అర్చన, కల్పన, షాట్‌పుట్‌లో కౌశల్య, కల్పన, అర్చనలు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించారు.
● క్రికెట్ పోటీల్లో సీఐలు రాజేంద్రప్రసాద్, సాయిప్రవీణ్, విజయ్ కుమార్‌ల జట్లు గెలుపొందాయి.


