ఆర్టీసీ బస్సు నుంచి పొగలు
● ఉలిక్కిపడి బస్సు నుంచి దిగిన
ప్రయాణికులు
చాగలమర్రి: కర్నూలు నుంచి తిరుపతికి బయలు దేరిన ఆర్టీసీకి చెందిన అల్ట్రా డీలక్ బస్సులో భారీగా పొగలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. చాగలమర్రి ఆర్టీసీ బస్టాండు వద్ద బస్సును ఆపడంతో క్షేమంగా కిందికి దిగారు. గురువారం తెల్లవారుజామున శిరివెళ్ల మెట్ట వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదానికి గురై ఇద్దరు డ్రైవర్లు, ఒక క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందిన ఘటన జరిగిన గంటల వ్యవధిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు ఆపిన డ్రైవర్ వెంటనే ఇంజిన్‌ను చల్లదనం చేసేందుకు రేడియేటర్‌లో నీళ్లు పోశారు. బస్సు దగ్ధం కాకుండా చర్యలు తీసుకున్నారు. పాత బస్సుల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరారు.


