కొనసాగుతున్న జేఈఈ మెయిన్స్‌ | - | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న జేఈఈ మెయిన్స్‌

Jan 23 2026 6:31 AM | Updated on Jan 23 2026 6:31 AM

కొనసాగుతున్న జేఈఈ మెయిన్స్‌

కొనసాగుతున్న జేఈఈ మెయిన్స్‌

ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల అరెస్టు దారుణం బాధితుడికి పరామర్శ

పాణ్యం: జాతీయస్థాయిలో ఇంజినీరింగ్‌ సీట్ల భర్తీకి బుధవారం ప్రారంభమైన జేఈఈ మెయిన్స్‌ ఫేజ్‌–1 ఆన్‌లైన్‌ పరీక్షలు రెండో రోజు గురువారం ప్రశాంతంగా కొనసాగాయి. నెరవాడ మెట్ట వద్ద ఉన్న ఆర్‌జీఎం ఇంజినీరింగ్‌ కళాశాలలో ఉదయం సెషన్‌కు 178 మందిగాను 170 మంది హాజరు కాగా 8 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం 175 మంది గాను 174 మంది హాజరు కాగా ఒకరు గైర్హాజరయ్యారు.

విధుల్లో అప్రమత్తంగా ఉండాలి

డోన్‌ టౌన్‌: అగ్నిమాపక సిబ్బంది విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని రాయలసీమ రీజియన్‌ ఫైర్‌ అధికారి భూపాల్‌రెడ్డి అన్నారు. గురువారం డోన్‌ అగ్నిమాపక కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని రికార్డులను పరిశీలిస్తూ ప్రమాదాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఫైర్‌ ఇంజన్‌ పనితీరు, సిబ్బంది వివరాలు తెలుసుకున్నారు. అనంతరం సిబ్బందికి సామర్థ్య పరీక్ష నిర్వహించారు. ఆయన వెంట డోన్‌ అగ్నిమాపక కేంద్రం అధికారి రంగస్వామిగౌడ్‌ ఉన్నారు.

కర్నూలు సిటీ: ఎస్టీ, ఎస్సీ పారిశ్రామికవేత్తలు తమ కు రావాల్సిన బకాయిలు చెల్లించాలని అడిగితే అరెస్టు చేశారని, వారిపై ఎందుకంత కక్ష గట్టారని బీఎస్పీ జిల్లా ఇన్‌చార్జ్‌ అరుణ్‌కుమార్‌ గురువారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. తమకు రావాల్సిన రూ.700 కోట్ల బకాయిలు చెల్లించాలని ఆందోళనకు దిగితే అరెస్టు చేస్తారా? అంటూ ఆయన చంద్రబాబు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల అరెస్టుపై సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. అల్కాలీస్‌ ఫ్యాక్టరీకి రూ.36.68 కోట్లు ఒకేసారి విడుదల చేశారని, అలాగే బడా పారిశ్రామికవేత్తలకు మాత్రం డబ్బులు ఇచ్చారని, కానీ ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రావాల్సిన బకాయిలు చెల్లించకుండా రోడ్డున పడేశారన్నారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు అప్పులు చేసి, ఆస్తులు తాకట్టుపెట్టి పరిశ్రమలు నిర్వహిస్తున్నారన్నారు. గత కొన్ని నెలలుగా ప్రభుత్వం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఇప్పటికీ పరిష్కారం కాలేదన్నారు. తప్పని పరిస్థితుల్లో ఆందోళన బాట పట్టారని, అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేసి, బకాయిలు చెల్లించాలని కోరారు.

ఓర్వకల్లు: మూడు రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురై, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడిని వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి గురువారం పరామర్శించారు. మండలంలోని హుసేనాపురం గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు గుర్రాల చెన్నారెడ్డి ఈ నెల 21వ తేదీన కర్నూలుకు వెళుతూ మార్గంమధ్యలో పూడిచెర్ల మెట్ట వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆయన్ను చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆసుత్రికి చేరుకొని పరామర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement